Kia India New Cars: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా సెల్టోస్, సోనెట్ మోడల్ కార్లను మరింత నూతనంగా తీర్చిదిద్దింది. మరిన్ని కొత్త హంగులను చేర్చి శుక్రవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొత్త సెల్టోస్ ప్రారంభ ధర రూ.10.19 లక్షలు కాగా.. సోనెట్ ధర రూ.7.15 లక్షలు. కొత్త వెర్షన్లలకు సంబంధించిన అన్ని వేరియంట్లలో 4 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసినట్లు కియా తెలిపింది. భద్రతను మరింత పెంచడంలో భాగంగా కారు పక్క భాగంలో కూడా ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు.
కొత్త ఫీచర్లతో కియా సోనెట్, సెల్టోస్ కార్లు.. ధరలు ఎంతంటే? - new cars in marker
Kia India New Cars: సెల్టోస్, సోనెట్ మోడళ్ల కొత్త వెర్షన్లను కియా ఇండియా విడుదల చేసింది. కొత్త వెర్షన్లలకు సంబంధించిన అన్ని వేరియంట్లలో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసినట్లు కియా తెలిపింది. వీటి ప్రారంభ ధరలు ఎంతంటే?
అలాగే పెద్ద వేరియంట్లలో ఉన్న కొన్ని హంగులను తాజా మోడళ్లలో కూడా చేర్చారు. ఈ కార్లన్నింటినీ కొత్త కియా కనెక్ట్ యాప్‌తో ఆధునికీకరించినట్లు తెలిపారు. కియా సెల్టోస్ డీజిల్ ఇంజిన్ కార్లలో ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సాంకేతికతను పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2.67 లక్షల యూనిట్ల సెల్టోస్, 1.25 లక్షల యూనిట్ల సోనెట్ కార్లను విక్రయించినట్లు కియా తెలిపింది. సెల్టోస్‌లో 13 అదనపు ఫీచర్లు, సోనెట్‌లో 9 కొత్త ఫీచర్లను చేర్చినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: IHC Invest in Adani group: అదానీ గ్రూప్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..