Journey Of Sensex From 1000 To 70000 :బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ మొదటిసారిగా 70,000 లెవెల్‌ను క్రాస్ చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ తాజాగా 21,000 వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. ఈ విజయ ప్రస్థానం వెనుక పెద్ద చరిత్రే ఉంది.
విజయ ప్రస్థానం
Timeline Of Sensex From 100 To 70000 :
- 1979లో 100 వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించిన సెన్సెక్స్.. ఈ 2023 డిసెంబర్ నాటికి 70,000కు చేరుకుంది. అంటే గత 44 ఏళ్లలో సెన్సెక్స్ మదుపరులకు 700 రెట్లు లాభాలను పంచిపెట్టింది.
- బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్ 1990లో మొదటిసారిగా 1000 లెవెల్‌ను క్రాస్ చేసింది. అక్కడి నుంచి నేటి వరకు ఈ విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
- మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చిన తరువాత.. దేశ పురోభివృద్ధి మరింత ముందుకు సాగింది. ఫలితంగానే స్టాక్ మార్కెట్లు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాయి.
దూకుడు పెరుగుతోంది!
- సెన్సెక్స్ 100 నుంచి 1,000 లెవెల్‌ను క్రాస్ చేయడానికి 11 ఏళ్లు పట్టింది. ఈ కాలంలో మదుపరులకు 23.3 శాతం చొప్పున వార్షిక రాబడి (CAGR) లభించింది.
- సెన్సెక్స్ 2006 ఫిబ్రవరిలో మొదటిసారి 10,000కు చేరింది. అంటే సెన్సెక్స్ 1,000 నుంచి 10,000 లెవెల్‌ను క్రాస్ చేయడానికి 16 ఏళ్లు పట్టింది. ఈ 16 ఏళ్లలో మదుపరులకు 15.5 శాతం చొప్పున వార్షిక రాబడి (CAGR) లభించింది.
- సెన్సెక్స్ 2007 అక్టోబర్‌లో 20,000 అత్యున్నత శిఖరాన్ని తాకింది. అంటే కేవలం 21 నెలల్లోనే రెట్టింపు అయ్యింది.
ఆర్థిక సంక్షోభం..
- ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా సెన్సెక్స్ 30,000 లెవెల్ చేరడానికి సుమారుగా 7 సంవత్సరాలు పట్టింది.
- సెన్సెక్స్ 2019 మే నెలలో 40,000 లెవెల్‌ను క్రాస్ చేసింది. అంటే 30,000 నుంచి 40,000 లెవెల్‌ను చేరడానికి కేవలం 4 ఏళ్లు మాత్రమే పట్టింది.
- సెన్సెక్స్ 40,000 నుంచి 50,000 చేరడానికి కేవలం 17 నెలలే పట్టింది.