తెలంగాణ

telangana

ETV Bharat / business

బయోకాన్​ ఛైర్మన్​ కిరణ్‌ మజుందార్‌ షా ఇంట విషాదం - కిరణ్ మంజూదార్ షా

ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా భర్త జాన్‌ షా సోమవారం కన్నుమూశారు. జాన్‌ గతంలో బయోకాన్‌ వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరించారు.

kiran mazumdar husband died
kiran mazumdar husband died

By

Published : Oct 24, 2022, 8:07 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్ షా ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, బయోకాన్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ జాన్‌ షా(73) సోమవారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జాన్‌ షా అంతిమ సంస్కారాలను బెంగళూరులోని విల్సన్‌ గార్డెన్స్‌ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు షా కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్నారు.

1998లో జాన్ షా - కిరణ్‌ మజుందార్‌ వివాహం జరిగింది. స్కాట్లాండ్‌కు చెందిన జాన్‌ గ్లాస్గో యూనివర్సిటీ నుంచి హిస్టరీ, పొలిటికల్‌ ఎకానమీలో ఎంఏ పూర్తిచేశారు గతంలో మదురా కోట్స్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. వివాహం తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి బయోకాన్‌లో చేరారు. 1999 నుంచి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా ఉన్న ఆయన.. 2001లో కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కంపెనీ విదేశీ ప్రమోటర్‌గా, అడ్వైజరీ బోర్డు సభ్యుడిగానూ వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details