తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆఫ్​లైన్ స్ట్రీమింగ్, ఫ్రీ కంటెంట్​​, 4K క్లారిటీ.. 'జియో సినిమా' ఓటీటీ మాత్ర‌మే కాదు.. అంత‌కు మించి! - జియో ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ప్లాన్‌లు

Jio Cinema Features : జియో సినిమా.. ప్ర‌స్తుతం దీని గురించి తెలియ‌ని వారు చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఐపీఎల్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి ఈ యాప్ దాదాపు ప్ర‌తి క్రికెట్ అభిమాని ఫోన్లో ఉంది. ఐపీఎల్​ను ఉచితంగా చూసే అవ‌కాశ‌మం ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. అయితే.. జియో సినిమా అనేది ఓటీటీ మాత్ర‌మే అని చాలా మంది అనుకుంటారు కానీ కాదు. ఇందులో అంత‌కు మించిన ఫీచ‌ర్లు ఉన్నాయి. అవేంటో మీరూ తెలుసుకోండి..

jio-ott-platform-jiocinema-ott-app-and-jiocinema-features
జియోసినిమా ఫీచర్లు

By

Published : May 28, 2023, 6:30 AM IST

Jio Cinema Features : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ - 2023 ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి దాదాపు ప్ర‌తి క్రికెట్ అభిమాని స్మార్ట్ ఫోన్​లో జియో సినిమా యాప్ ఉంది. రిల‌య‌న్స్ కంపెనీల్లో అంత‌ర్భాగమైన దీనికి.. ఐపీఎల్ ఓటీటీ ప్ర‌సార హ‌క్కులు కొనుగోలు చేసిన త‌ర్వాత, లీగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి విప‌రీతంగా ప్రజాద‌ర‌ణ పెరిగింది. యాప్ డౌన్​లోడ్ సంఖ్య ల‌క్ష‌ల‌కు పెరిగింది. ఐపీఎల్​ను ఇందులో ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ లేకుండా చూసే సౌక‌ర్యం ఉండ‌ట‌మే దీనికి కార‌ణం.

జియో సినిమా కంటే ముందు ఈ లీగ్ ప్ర‌సార హ‌క్కులు డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్​కు ఉండేవి. ఈ ఏడాది జరిగిన వేలంలో జియో దీన్ని సొంతం చేసుకుంది. దేశంలో ఐపీఎల్ లాంటి స్పోర్ట్స్ లీగ్​ను 4K లైవ్ స్ట్రీమింగ్ చేసే ఏకైక ఓటీటీ ఇదే. అయితే జియో సినిమా ఓటీటీ ప్లాట్​ఫామ్ మాత్ర‌మే అని చాలా మంది అభిప్రాయం. కానీ ఇందులో అంత‌కు మించిన ఫీచ‌ర్లులున్నాయ‌ని త‌క్కువ మందికి తెలుసు. దీనికి సంబంధించిన స‌బ్ స్క్రిప్ష‌న్ ప్లాన్లు, ఇత‌ర ఫీచ‌ర్ల గురించి తెలుసుకుందాం.

ఉచితంగా కంటెంట్ చూడొచ్చు..
అమెజాన్ ప్రైమ్‌, నెట్​ఫ్లిక్స్ లాగే జియో సినిమా ఒక ఓటీటీ ప్లాట్​ఫామ్‌. అవి అందించే సేవ‌ల్నే ఇదీ అందిస్తుంది. వాటిల్లో ఉన్నట్లే ఇందులోనూ కంటెంట్ ఉంటుంది. వాటికి స‌బ్​స్క్రిప్ష‌న్ తీసుకుంటేనే అందులో ఉన్న కంటెంట్​ను చూడ‌గలం. కానీ జియో సినిమాలో కొంత కంటెంట్ వినియోగ‌దారులు ఉచితంగా చూడ‌వ‌చ్చు. స‌బ్​స్క్రిప్ష‌న్ తీసుకున్న వారికి అద‌న‌పు కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఇదే వాటికీ దీనికి ప్ర‌ధాన తేడా.

4K రిసొల్యూష‌న్​లో కంటెంట్ ప్ర‌సారం..
ఈ కంపెనీ ఇటీవ‌ల త‌మ ప్రీమియం ప్లాన్లు వెల్ల‌డించింది. రూ.999తో స‌బ్​స్క్రిప్ష‌న్ తీసుకుంటే ఉచితంగా లైవ్ స్పోర్ట్స్, స్ట్రీమింగ్‌, మూవీలు, వెబ్ సిరీస్​లు, Viacom 18కు సంబంధించిన న్యూస్ ఛాన‌ళ్ల లైవ్ స్ట్రీమింగ్‌, సీరియ‌ల్స్, ఇత‌ర కంటెంట్‌ను 4K రిసొల్యూష‌న్​లో వీక్షించ‌వ‌చ్చు. వినియోగ‌దారులు యాడ్ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక ప్రీమియం అకౌంట్​ను 4 డివైజ్​ల‌లో ఒకే స‌మ‌యంలో ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు.

ఎక్స్ క్లూజివ్ హాలీవుడ్ కంటెంట్..
జియో సినిమా HBO, Warners Bros కంపెనీల‌తో ఒప్పందం చేసుకుంది. అందువ‌ల్ల వాటికి సంబంధించిన ఎక్స్​క్లూజివ్ కంటెంట్ అందుబాటులో ఉంది. దీంతో పాటు Game of Thrones, The Last of Us లాంటి పాపుల‌ర్ హాలీవుడ్ కంటెంట్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా The House of the Dragon, Westworld, True Detective లాంటి స్ట్రీమ్ కంటెంట్‌ను ఇండియాలో వీక్షించ‌వ‌చ్చు. కానీ ఇవి స‌బ్​స్క్రిప్ష‌న్ తీసుకున్న వాళ్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.

ఆఫ్ లైన్ స్ట్రీమింగ్..
ఇందులో ఉన్న కంటెంట్​ను డౌన్​లోడ్ చేసుకుని ఇంట‌ర్​నెట్ లేని స‌మ‌యంలో చూడొచ్చు. కానీ దాన్ని ఇత‌రుల‌కు షేర్ చేయ‌లేం. లో, మీడియం, హై క్వాలిటీలో డౌన్​లోడ్ చేసుకోవ‌చ్చు. మిగ‌తా ఆన్​లైన్ కంటెంట్ చూడాలంటే లాగిన్ అవ్వాల్సిందే. కేవ‌లం జియో సిమ్ ఉంటేనే ఇది ప‌ని చేస్తుందా అంటే.. లేదు. ఏ మొబైల్ నెట్​వ‌ర్క్​తో అయినా చూడ‌వ‌చ్చు. ముఖ్యంగా 1080 పిక్సెల్‌, 4K కంటెంట్ చూడాలంటే హై స్పీడ్ ఇంట‌ర్​నెట్ క‌నెక్ష‌న్ ఉండాలి.

ఇప్ప‌టిదాకా జియో సినిమా యాప్​లో చిల్డ్రెన్ మోడ్ లేదు. కానీ.. వినియోగ‌దారులు త‌మ కంటెంట్ ప్రిఫ‌రెన్సులు ఎంచుకోవ‌చ్చు, మార్చుకోవ‌చ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌, ఐవోఎస్‌, యాపిల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ ఆప‌రేటింగ్ సిస్టం, టైజెన్ ఓఎస్‌, ఫైర్ టీవీ ఓఎస్​ల నుంచి ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోవ‌చ్చు.

ABOUT THE AUTHOR

...view details