ITR Verification :ఆదాయపన్ను శాఖ.. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. ఐటీఆర్ దాఖలు చేసిన తరువాత 30 రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులకు స్పష్టం చేసింది.
ఈ-వెరిఫై చేసుకోకపోతే!
Is E Verification Of ITR Mandatory : ఒక వేళ మీరు ఐటీఆర్ దాఖలు చేసిన తరువాత.. ఈ-వెరిఫికేషన్ చేసుకోకపోతే.. ఫైలింగ్ ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్లు పరిగణిస్తారు. అలాగే దానిని ఇన్వాలీడ్ (చెల్లని) ఐటీఆర్ ఫైలింగ్గా గుర్తిస్తారు.
పెనాల్టీ కూడా!
ITR Penalty :ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు కీలకమైన సూచన చేసింది. వీలైనంత త్వరగా ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. లేకుంటే గడువు మీరిన తరువాత పెనాల్టీ (జరిమానా) విధించే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
"డియర్ టాక్స్ పేయర్స్.. ఇవాళే ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. గుర్తుంచుకోండి! ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లో ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ గడువులోగా ఈ-వెరిఫికేషన్ చేసుకోకపోతే.. ఇన్‌కం టాక్స్ యాక్ట్-1961 ప్రకారం, మీపై ఆలస్య రసుము (పెనాల్టీ) విధించే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేయకండి. ఈ రోజే ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి చేయండి."
- ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ ట్వీట్
ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ ఎందుకు చేయాలి?
ITR E Verification Is Necessary :ఆదాయపన్ను రిటర్నులు చెల్లుబాటు కావాలంటే, కచ్చితంగా ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి. ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ 2023 ఆగస్టు నుంచి ఈ నిబంధనను అమలులోకి తెచ్చింది.
ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ చేసుకోవడం ఎలా?
ITR E-Verification Process :
- ముందుగా ఆదాయపన్ను శాఖకు చెందిన e-filing పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- పోర్టల్‌లో e-verify return లింక్‌పై క్లిక్ చేయాలి.
- పాన్ నంబర్, అసెస్మెంట్ ఇయర్ (2023-24), రసీదు సంఖ్యను నమోదు చేయాలి. లేదా దీనికి ప్రత్యామ్నాయంగా..
- పోర్టల్‌లో మీ పాన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
- పోర్టల్‌లోని My Account సెక్షన్లోకి వెళ్లి, e-verify return ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీనితో ఓ సరికొత్త వెరిఫికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అప్పుడు మీరు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందు కోసం మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- ఇంతకంటే సులువుగా ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసే మార్గం మరొకటి ఉంది. మీరు నేరుగా నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కు వెళ్లి, ఐటీఆర్ సెగ్మెంట్లో ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
రీఫండ్ టైమ్ తగ్గింపు
Income Tax Refund Processing Time : ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు.. టాక్స్ రీఫండ్ అందించే సమయాన్ని బాగా తగ్గించే దిశగా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం 16 రోజుల వ్యవధిలో ఐటీఆర్ రీఫండ్ అందిస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ రీఫండ్ వ్యవధిని 10 రోజులకు తగ్గించాలని ఆదాయపన్ను శాఖ ఆలోచిస్తోంది.