Elon Musk New Social Media: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. తన పోస్టులతో యూజర్లను అప్పుడప్పుడూ తికమక పెడుతుంటారు. కొన్నిసార్లు ఆయన పెట్టే ట్వీట్లు అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంటుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ అలాంటి పరిస్థితికే దారి తీసింది.
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్ల ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించగా.. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ఓ యూజర్ మస్క్‌కు ఓ ప్రశ్న వేశాడు. "ఒకవేళ ట్విట్టర్ డీల్ పూర్తిగా రద్దు అయిపోతే .. మరో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏమైనా ఏర్పాటు చేస్తారా?" అని ప్రశ్నించాడు. దీనికి మస్క్ సమాధానంగా ఎక్స్.కామ్(X.com) అంటూ ట్వీట్ చేశారు. దీంతో మస్క్ ఈ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించనున్నారంటూ నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది.