తెలంగాణ

telangana

ETV Bharat / business

IRCTC Zomato Tie Up : రైలు ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. ఇకపై ట్రైన్​లోనూ జొమాటో ఫుడ్ డెలివరీ షురూ! - ట్రైన్స్​లో జొమాటో ఫుడ్​ డెలివరీ

IRCTC Zomato Tie Up : రైలు ప్రయాణికులకు గుడ్​ న్యూస్​ చెప్పింది ఐఆర్‌సీటీసీ. ఫుల్​ డెలివరీ సర్వీస్​ కోసం జొమాటోతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. దీనితో ఇకపై రైళ్లల్లో ప్రయాణించే వారు తమకు కావాల్సిన ఫుడ్​ను జొమాటోలో ఆర్డర్​ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

IRCTC Zomato Tie Up
IRCTC-Zomato

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 2:32 PM IST

Updated : Oct 18, 2023, 2:51 PM IST

IRCTC Zomato Tie Up :ఐఆర్​సీటీసీ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ప్రయాణికులకు ఫుడ్​ డెలివరీ సర్వీస్​ అందించడం కోసం.. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనితో ఇకపై రైళ్లల్లో ప్రయాణించే వారు తమకు నచ్చిన ఆహార పదార్థాలను ముందుగానే యాప్​లో ఆర్డర్​ చేసుకోవచ్చు. ఇలా బుక్​ చేసిన ఫుడ్​ను జొమాటో యాప్‌ సాయంతో ప్యాసెంజర్స్​కు అందించనుంది భారతీయ రైల్వే. అయితే ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని కేవలం దేశంలోని ఐదు స్టేషన్లలో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. మున్ముందు దీనిని మితగా రైల్వే స్టేషన్లకూ విస్తరించే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి ఈ ఐదు స్టేషన్​లలో..
IRCTC Zomato Food Delivery Tie Up : ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ-క్యాటరింగ్‌ సర్వీసెస్​ కింద రైలు ప్రయాణికులు ఈ సుదపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సేవల ద్వారా తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. అలా ఆర్డర్​ పెట్టిన పదార్థాలను జొమాటో సాయంతో సంబంధిత స్టేషన్లకి పంపిస్తారు. అయితే ప్రస్తుతానికి 'ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ (PoC)' కింద ఈ ప్రయోగాన్ని దేశ రాజధాని న్యూదిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌, లఖ్‌నవూ, వారణాసి రైల్వే స్టేషన్లలో మాత్రమే అమలు చేయనున్నారు. కాగా, ఆహారం విషయంలో ప్రయాణికులకు మరిన్ని అవకాశాలను అందించడంలో భాగంగానే జొమాటోతో కలిసి ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

వారికి ప్రత్యేక 'థాలీ..'
పండగ సీజన్‌ సందర్భంగా ఇండియన్​ రైల్వే క్యాటరింగ్‌ సర్వీసెస్​ ప్రత్యేక సేవలు, ఆఫర్లను ప్రయాణికుల కోసం ప్రకటించింది. దేవీ నవరాత్రుల నేపథ్యంలో ఉపవాసం ఉండేవారి కోసం ప్రత్యేకంగా 'థాలీ' సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

ఫ్రీ-ఫుడ్​ డెలివరీ..
Zomato Gold Membership : 'జొమాటో గోల్డ్​'(Zomato Gold) మెంబర్​షిప్​తో వినియోగదారులు ఫ్రీ-ఫుడ్​ డెలివరీ సదుపాయాన్ని పొందవచ్చు. జొమాటో ఇంతకు ముందు రూ.999గా ఉన్న మూడు నెలల సబ్​స్క్రిప్షన్​ను ఇప్పుడు కేవలం రూ.149కే అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్​ కింద రూ.199 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్లు చేసినవారు.. 10 కిలోమీటర్ల పరిధిలోపు ఉండే రెస్టారెంట్ల నుంచి ఉచిత ఫుడ్​ డెలివరీని పొందవచ్చు.

Hyderabad to Shirdi IRCTC Tour Package : షిరిడీ వెళ్తున్నారా..? IRCTC సూపర్ ప్యాకేజీ మీకోసం..!

How to get Discounts on Train Tickets : రైలు టికెట్లు డిస్కౌంట్లో కావాలా నాయనా..? ఇలా చేయండి​!

IRCTC Punya Kshetra Yatra Details and How to Book Online..?: రూ.16 వేలకే 6 పుణ్యక్షేత్రాల దర్శనం... ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. ఎలా బుక్​ చేయాలంటే..?

Last Updated : Oct 18, 2023, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details