IRCTC Service Restored : రైల్వే ప్రయాణికులను గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ 4 గంటల అంతరాయం తరువాత టికెట్ బుకింగ్ సేవలను మళ్లీ పునరుద్ధరించింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ యాప్ (రైల్ కనెక్ట్), ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ తథాతథంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రయాణికులు ఎదుర్కొన్న అంతరాయానికి చింతిస్తున్నామని ఐఆర్‌సీటీసీ విచారం వ్యక్తం చేసింది.
IRCTC Service Restored : 4 గంటల అంతరాయం తరువాత.. టికెట్ బుకింగ్ సేవలు పునరుద్ధరించిన IRCTC
IRCTC Service Restored : ఐఆర్‌సీటీసీ టికెట్ల బుకింగ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ఎట్టకేలకు తొలగిపోయింది. 4 గంటల అంతరాయం తరువాత టికెట్ బుకింగ్ సేవలు మరలా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
4 గంటల తరువాత
IRCTC Ticket booking issue : మంగళవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తి ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయి. దీనితో అత్యవసరంగా రైలు ప్రయాణం చేయాల్సిన వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో అంతరాయం ఏర్పడడం వల్ల చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాస్తవానికి ఉదయం 10 గంటలకు ఏసీ తరగతి (2A/3A/CC/EC/3E) ఉదయం 11:00 గంటలకు నాన్ ఏసీ తరగతికి (SL/FC/2S) కోసం తత్కాల్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా.. ఐఆర్‌సీటీసీలో టెక్నికల్ సమస్య కారణంగా చాలా మంది టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు. దీనితో ఈ సమస్యపై రైల్వే శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే రంగంలోకి దిగిన సాంకేతిక బృందం 4 గంటలపాటు నిర్విరామంగా కృషి చేసి ఐఆర్‌సీటీసీ టెక్నికల్ సమస్యను పరిష్కరించింది. దీనితో సమస్య పరిష్కారమై, సేవలు అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఐఆర్‌సీటీసీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి!
IRCTC B2C PARTNERS : వాస్తవానికి ట్రైన్ టికెట్ బుకింగ్ సేవలను అనేక ఇతర యాప్‌లు కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, పేటీఎం, మేక్ మై ట్రిప్ లాంటి బీ2సీ వేదికల ద్వారా రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా అనేక యాప్స్ కూడా రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలును కల్పిస్తున్నాయి.
- ఇవీ చదవండి :
- IRCTCలో రైలు టికెట్స్ బుక్ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!
- Buying vs Renting House : సొంత ఇళ్లు Vs అద్దె ఇళ్లు.. ఏది బెటర్ ఛాయిస్!
- Retirement Planning : నెలకు రూ.50 వేలు పెన్షన్ ఇచ్చే.. బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ మీకు తెలుసా?
- Vehicle Insurance Renewal : వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఎలా చేసుకోవాలో తెలుసా?