తెలంగాణ

telangana

ETV Bharat / business

IPOs in 2022: 28 ఐపీఓలు.. రూ.45వేల కోట్లు.. త్వరలో మరిన్ని.. - 2022 ఐపీఓలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐపీఓ ద్వారా నిదులు సమకూర్చేందుకు 28 కంపెనీలకు సెబీ అనుమతించింది. ఇందులో 11 సంస్థలు రూ.33వేల కోట్లు సమీకరించాయి. మరికొన్ని సంస్థలు ఐపీఓలకు రావాల్సి ఉంది.

IPO RECORDS
IPO RECORDS

By

Published : Aug 8, 2022, 6:47 AM IST

IPOs in 2022: తొలి పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీఓ) ద్వారా రూ.45,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జులై మధ్య 28 కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 11 సంస్థలు ఐపీఓలకు రావడం ద్వారా రూ.33,000 కోట్ల సమీకరించాయి.

ఫ్యాబ్‌ ఇండియా, భారత్‌ ఎఫ్‌ఐహెచ్‌, టీవీఎస్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, మాక్లియోడ్స్‌ ఫార్మాస్యూటికల్స్‌, కిడ్స్‌ క్లినిక్‌ ఇండియాలు సెబీ నుంచి అనుమతులు పొందిన కంపెనీల్లో ఉన్నాయి. ఇవన్నీ తమ ఐపీఓల తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు సవాళ్లతో కూడుకుని ఉండటంతో, ఆయా సంస్థలు ఐపీఓ తేదీల ప్రకటనకు సరైన సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.

  • ఏప్రిల్‌-జులై మధ్యలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.33,254 కోట్లు సమీకరించాయి. ఇందులో సింహభాగం (రూ.20,557 కోట్లు) లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) సమీకరించింది. ఈ ఐపీఓలు ఏప్రిల్‌-మే మధ్యలోనే వచ్చాయి. మే తర్వాత ఒక్క ఐపీఓ కూడా రాలేదు.
  • 2021-22లో 52 కంపెనీలు ప్రాథమిక మార్కెట్‌ నుంచి రూ.1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం సాంకేతిక అంకురాలు ఐపీఓలకు రావడం, వీటికి రిటైల్‌ మదుపర్ల నుంచి విశేష ఆదరణ లభించడం చూశాం. కొన్ని కంపెనీలు భారీ లిస్టింగ్‌ లాభాల్ని కూడా అందించాయి.

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన కొన్ని కంపెనీలు షేర్ల విలువలు తదుపరి దశలో బాగా తగ్గాయి. జొమాటో తొలుత లాభపడినా తరవాత నిరుత్సాహపరచింది. పేటీఎంతో పాటు అతి పెద్ద ఎల్‌ఐసీ ఐపీఓ కూడా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు నుంచే నిరుత్సాహపర్చడంతో ఐపీఓ మార్కెట్‌ డీలా పడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ముఖ్య పెట్టుబడులు వ్యూహకర్త విజయ్‌కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2-3 నెలల్లో కొన్ని కంపెనీలు ఐపీఓకు రావచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ సీఈఓ అభిజిత్‌ అంచనా వేశారు. షేరు ధర కూడా సహేతుకంగా నిర్ణయించవచ్చని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details