తెలంగాణ

telangana

ETV Bharat / business

Iphone 15 First Day Sales : 'మేడ్​ ఇన్ ఇండియా' ఐఫోన్​ 15కు భలే గిరాకీ.. లాంఛ్​ అయిన ఫస్ట్​ డేనే రికార్డులు బద్దలు! - ఐఫోన్​ 15 సిరీస్ తొలిరోజు అమ్మకాలు

Iphone 15 Series Record Sales : ఐఫోన్​ 15 సిరీస్​ అమ్మకాలు రికార్డులు బ్రేక్​ చేశాయి. ఐఫోన్​ 14 సిరీస్​ ఫస్ట్​డే సేల్స్​తో పోలిస్తే.. విక్రయాలు ప్రారంభించిన తొలిరోజే 100 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Iphone 15 100 Percent Sales
Iphone 15 Series Record Sales

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 10:20 PM IST

Iphone 15 Series Record Sales : ఐఫోన్​ 15 సిరీస్​ ఫోన్లు సేల్స్​ పరంగా రికార్డులను బద్దలు కొట్టాయి. ఐఫోన్​ 14 సిరీస్​ తొలిరోజు ​విక్రయాలతో పోలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా దీని(ఐఫోన్​ 15 సిరీస్​) అమ్మకాలు ప్రారంభించిన మొదటిరోజే 100 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​ మోడళ్లకు తొలిరోజే మంచి డిమాండ్​ ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.

యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 15 సిరీస్‌ను సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్​ అమ్మకాలను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్​ 22న(శుక్రవారం) ప్రారంభించింది. కాగా, సేల్స్​ ప్రారంభించిన మొదటి రోజే ఐఫోన్​ 14 సిరీస్​ విక్రయాల రికార్డులను అధిగమించింది ఐఫోన్​ 15. అయితే ఈ విషయంపై యాపిల్​ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 'శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఐఫోన్​ 14 సిరీస్​ అమ్మకాలతో పోలిస్తే ఐఫోన్​ 15 సిరీస్​ ఫస్ట్​ డే సేల్స్​ 100 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అన్ని యాపిల్​ స్టోర్​లలో భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. అందరూ తమ ఆఫీసు పనులను ముగించుకొని నేరుగా ఐఫోన్​ విక్రయ కేంద్రాలకు పోటెత్తారు.' అని మార్కెట్​తో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు.

ఐఫోన్​ 15 ధరలు..
ప్రస్తుతం ఐఫోన్​ 15 సిరీస్​ ఫోన్లు బ్లూ, బ్లాక్, గ్రీన్​, ఎల్లో, పిక్​ కలర్ ఆప్సన్స్​లో వస్తున్నాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీ కెపాసిటీలో వచ్చిన ఐఫోన్​ 15 ధరలు.. రూ.79,900, రూ.89,900ల ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్​ 15 ప్రో రేట్స్​..
ఐఫోన్​ ప్రో సిరీస్​ ఫోన్లు బ్లూ టైటానియం, బ్లాక్​ టైటానియం, వైట్​ టైటానియం, నేచురల్ టైటానియం కలర్స్​లో వస్తున్నాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉన్న ఐఫోన్​ 15 ప్రో సిరీస్​ మోడల్​ ఫోన్​లు రూ.1,34,900ల ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉన్నాయి. 1టీబీ స్టోరేజీ కెపాసిటీతో ఉండే ఐఫోన్​ 15 ప్రో ధర భారత్​లో రూ.1.99 లక్షలుగా ఉంది.

ఆర్డర్​ పెట్టిన 10 నిమిషాలకే..
యాపిల్​ ప్రీమియం రీసెల్లర్​ యూనికార్న్​ భాగస్వామ్యంతో దిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఐఫోన్​ 15 సిరీస్​ ఫోన్​లను కస్టమర్లు ఆర్డర్​ పెట్టిన 10 నిమిషాలకే డెలివర్​ చేస్తున్నట్లు Blinkit అనే క్విక్​ కామర్స్​ ప్లాట్​ఫామ్​ తెలిపింది. మరోవైపు ఐఫోన్​ లవర్స్​ను మరింత ఆకట్టుకునేందుకు రిలయన్స్ రిటైల్.. ఐఫోన్​ 15 కస్టమర్ల కోసం ఆరు నెలల ఉచిత జియో సేవలతో పాటు అపరిమిత డేటా ప్యాక్​ను ఆఫర్​ చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details