ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య భారీ నష్టం వచ్చినట్లు వెల్లడించింది. ఏకంగా రూ.1992.53 కోట్ల నికర నష్టం నమోదైనట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయానికి రూ.5,941.37 కోట్ల నికర లాభాలు వచ్చినట్లు పేర్కొంది. 2020 తర్వాత త్రైమాసికాల్లో సంస్థకు నష్టాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఆ చమురు సంస్థకు భారీ నష్టం.. మళ్లీ పెట్రో బాదుడు తప్పదా?
దిగ్గజ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారీ నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.1992.53 కోట్ల నష్టం వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఇలా నష్టం రావడం 2020 తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది.
fuel
గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు. ఐఓసీకి నష్టాలు నమోదు కావడం వెనుక ఇదొక కారణమని సంస్థ పేర్కొంది. బ్యారెల్ చమురు విలువ 100 డాలర్లు దాటినా దేశంలో ఇంధన ధరల పెంపునకు కేంద్రం సమ్మతించలేదు. ఐఓసీతో పాటు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇదీ చూడండి :మహిళా సంపన్నురాలిగా రోష్ని నాడార్.. అపోలో నుంచి నలుగురు!