తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈఎంఐలు మరింత భారం.. ఆర్​బీఐ సమీక్షకు ముందే బ్యాంకుల బాదుడు - interest rates increase 2022 india

Interest rates increase 2022 : రుణ చెల్లింపుదారులకు ఈఎంఐలు మరింత భారంగా మారనున్నాయి. వడ్డీ రేట్లు పెంచుతూ రిజర్వు బ్యాంకు ఈనెల 5న ప్రకటన చేయవచ్చని అంతా భావిస్తుండగా.. అంతకుముందే వేర్వేరు బ్యాంకులు బాదుడు మొదలుపెట్టాయి. వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి.

bank rates 2022
ఈఎంఐలు మరింత భారం.. ఆర్​బీఐ సమీక్షకు ముందే బ్యాంకుల బాదుడు

By

Published : Aug 2, 2022, 7:56 AM IST

Interest rates increase India : ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, ఈనెల 3-5 తేదీల్లో నిర్వహించనున్న సమీక్షలో రెపో రేటును మరో 25-35 బేసిస్‌ పాయింట్ల మేర రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పెంచవచ్చని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రుణ రేట్లను ముందుగానే పెంచడం ప్రారంభించాయి. నిధుల వ్యయం ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను అవి సవరిస్తున్నాయి. గృహరుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున వడ్డీని పెంచగా, ఇదే దిశలో బ్యాంకులూ నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. దీంతో ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ భారం పెరుగుతోంది.

  • ఐసీఐసీఐ బ్యాంక్‌ 15 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో, ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.90 శాతానికి చేరింది.
  • సీఎస్‌బీ బ్యాంకు 20-30 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడంతో, బ్యాంకు రుణాల రేట్లు 8.10-9.90 శాతానికి చేరాయి.
  • బంధన్‌ బ్యాంక్‌ శనివారం నుంచి అమల్లోకి వచ్చేలా 18-88 బేసిస్‌ పాయింట్ల మేరకు సవరించింది. ఈ బ్యాంకు రుణరేట్లు 8.49-10.6శాతం మధ్య ఉన్నాయి.
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈనెల 1 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాంకు రుణ రేట్లు 6.80-7.80 శాతంగా ఉన్నాయి.
  • ఇండియన్‌ బ్యాంక్‌ 10-20 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో, రుణ రేట్లు 6.85-7.65 శాతానికి మారాయి.
  • యెస్‌ బ్యాంక్‌ కూడా 1 నుంచే 10 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో, రుణరేటు 9.05 శాతానికి చేరింది.
  • ఆర్‌బీఐ రెపో రేటు పెంచితే.. ఆ మేరకు రెపో ఆధారిత వడ్డీ రేట్లూ అధికమవుతాయి.

ABOUT THE AUTHOR

...view details