Indonesia Palm Oil: ప్రపంచవ్యాప్తంగా చుక్కలనంటుతున్న వంటనూనెల ధరలు త్వరలోనే కాస్త దిగువకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ దేశం నుంచి పామాయిల్ ఎగుమతిపై నెల రోజులుగా అమల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఇండోనేసియా తాజాగా నిర్ణయించడమే ఇందుకు కారణం. ఈ నెల 23 నుంచి తమ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు దేశాధ్యక్షుడు జోకో విడొడొ వెల్లడించారు. ప్రపంచంలో 85% పామాయిల్ ఇండోనేసియా, మలేసియాల్లోనే ఉత్పత్తవుతుంటుంది.
త్వరలో దిగిరానున్న వంటనూనె ధరలు ! - వంటనూనె ధరలు
Indonesia Palm Oil: వంటనూనె ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఇండోనేషియా తాజాగా ఎత్తివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చుక్కలనంటుతున్న వంటనూనెల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Indonesia Palm Oil
దేశీయంగా కొరతను నివారించడమే కాకుండా ధరలకు కళ్లెం వేసేందుకుగాను వంటనూనెల ఎగుమతిపై ఇండోనేసియా నిషేధాన్ని ఏప్రిల్ 28న అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పామాయిల్ రేట్లు రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. భారత్ ఏడాదికి 8 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి అవుతుండగా.. ఇండోనేషియాలోనే 48 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. పామాయిలే ఆ దేశ ప్రధాన ఆదాయ వనరు.
Last Updated : May 20, 2022, 7:59 AM IST