తెలంగాణ

telangana

ETV Bharat / business

50పైసల కన్నా తక్కువ పేమెంట్​తో రూ.10 లక్షల బీమా.. రైల్వే ఇన్సూరెన్స్ గురించి తెలుసా?

Indian railways travel Insurance : ఒడిశా రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్క రైలు ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. అది ఏమిటంటే భారతీయ రైల్వేస్​ ప్రతి రైలు ప్రయాణికుడిని రూ.10 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్​ కల్పిస్తుంది. తీవ్రంగా గాయపడి శాశ్వతంగా అంగ వైకల్యం కలిగినప్పుడు రూ.7.5 లక్షల వరకు, క్షతగాత్రులకు వైద్య ఖర్చులు నిమిత్తం రూ.2 లక్షల వరకు బీమా కల్పిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం..

IRCTC INSURANCE
IRCTC INSURANCE

By

Published : Jun 3, 2023, 7:32 PM IST

ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వే నెట్​వర్క్​లలో ఉన్న దేశాల్లో ఒకటి. రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. వాస్తవానికి ప్రయాణికుల సౌకర్యాల కల్పన కోసం, వారి సంరక్షణ కోసం ఇండియన్​ రైల్వేస్​ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రయాణికులకు ఇన్సూరెన్స్​ కల్పిస్తుంది. అయితే ఈ విషయం చాలా మంది రైలు ప్రయాణికులకు తెలియదు.

ఒక్క రూపాయితో రూ.10 లక్షల వరకు బీమా
Railway Travel Insurance : ఒడిశా ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా రైల్వే బీమా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ రైల్వేలు ప్రతి ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా కల్పిస్తుంది. రైలు ప్రమాదం జరిగి మరణం సంభవించినా లేదా శాశ్వతంగా అంగ వైకల్యం ఏర్పడి, మరే పని చేయలేని పరిస్థితిలో బాధితులు ఉన్నప్పుడు రూ.10 లక్షల వరకు బాధిత కుటుంబాలకు అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా సొమ్ము బాధితుడికి ఇస్తారు. రైలు ప్రమాదంలో క్షతగాత్రులు అయిన వారికి వైద్య ఖర్చులు నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. వాస్తవానికి ఒక్క రూపాయి కన్నా తక్కువ రుసుముతోనే ఇండియన్​ రైల్వేస్​ ట్రావెల్​ ఇన్సూరెన్స్​ కల్పిస్తూ ఉండడం విశేషం.

ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు
ఆన్​లైన్​లో రైల్వే టికెట్లు బుక్​ చేసుకునే వారికి ​ ట్రావెల్​ ఇన్సూరెన్స్​ సౌకర్యాన్ని ఇండియన్​ రైల్వేస్​ కల్పిస్తోంది. ఈ విషయం తెలియక చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైనప్పటికీ ఎలాంటి పరిహారం పొందలేకపోతున్నారు.

ఎలా ఇన్సూరెన్స్​కు అప్లై చేయాలి?
ఆన్​లైన్​లో రైల్వే టికెట్స్​ బుక్​ చేసుకునేటప్పుడు, వెబ్​సైట్​లో​ట్రావెల్​ ఇన్సూరెన్స్​ చేసుకోవడానికి ఒక పాప్​ అప్ (Pop Up) వస్తుంది​. ఆ పాప్​ఎప్​ ఓపెన్​ చేసి, ఇన్సూరెన్స్​ కోసం 50 పైసల కన్నా తక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలా రుసుము చెల్లించిన వెంటనే మీ ఫోన్​కు, ఈ-మెయిల్​కు ఒక లింక్​ వస్తుంది. వాస్తవానికి ఇది ఇన్సూరెన్స్​ కంపెనీకి సంబంధించిన లింక్​. ఆ లింక్​ ఓపెన్​ చేసి, కచ్చితంగా మన నామినీ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.
నోట్​:నామినీ వివరాలు మనం అందించకపోతే, ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేయడానికి వీలుపడదు.

ఇన్సూరెన్స్​ తీసుకున్న ప్రయాణికులు దురదృష్టవశాత్తు రైలు ప్రమాదంలో మరణిస్తే, వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చులు కోసం రూ.10,000 కూడా ఇన్సూరెన్స్​ కంపెనీ కల్పిస్తుంది.

బీమా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
రైలు ప్రమాదం జరిగి మరణం సంభవించినా, పూర్తిగా అంగవైకల్యం ఏర్పడినా, సాధారణ అంగవైకల్యం ఏర్పడినా, లేదా తీవ్రంగా గాయపడినా సరే ట్రావెల్​ ఇన్సూరెన్స్​ను క్లెయిమ్​ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నామినీగా ఉన్న వ్యక్తి తగిన పత్రాలు తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. అక్కడ అధికారులు అన్ని పత్రాలను సరిచూసుకున్న తరువాత, నాలుగు నెలల్లోగా బాధితులకు బీమా సొమ్మును అందిస్తారు.

మీలో ఎవరికైనా ఈ ట్రావెల్​ ఇన్సూరెన్స్​ గురించి తెలిసినా, లేక ఇప్పుడు తెలుసుకున్నా, ఇకపై కచ్చితంగా రైలు ప్రయాణం చేసినప్పుడు ఇన్సూరెన్స్​ను తీసుకోండి. తెలియని వారికి తప్పకుండా ఈ విషయం గురించి తెలియజేయండి.

ABOUT THE AUTHOR

...view details