తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈఏడాది తొలిసారి తగ్గిన విమాన ఇంధన ధరలు.. ఊరట లభించేనా? - ఏటీఎఫ్‌

Indian Oil Cuts Jet Fuel Price: ఈ ఏడాదిలో దాదాపు 10సార్లు పెరుగుతూ వచ్చిన విమాన ఇంధన ధరలు తొలిసారి తగ్గాయి. ఏవియేషన్‌ టర్బైన్ ఫ్యుయల్‌ ధరల్ని 1.3 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దీంతో దిల్లీలో కిలో లీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.1.21 లక్షలకు చేరింది.

atf fuel price
ATF

By

Published : Jun 1, 2022, 12:19 PM IST

Indian Oil Cuts Jet Fuel Price: విమాన ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్ ఫ్యుయల్‌ ధరల్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బుధవారం తగ్గించింది. ఈ ఏడాది ధరల్ని తగ్గించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దిల్లీలో కిలో లీటర్‌ ఏటీఎఫ్‌ ధర 1.3 శాతం తగ్గి రూ.1.21 లక్షలకు చేరింది.

మే 16న ఏటీఎఫ్‌ ధరలు 5 శాతం పెరగడం వల్ల కిలోలీటర్‌ ధర రూ.1.23 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో రూ.72,062గా ఉన్న కిలోలీటర్‌ విమాన ఇంధన ధర భారీగా పెరిగి రూ.1.23 లక్షల వద్ద జీవనకాల గరిష్ఠానికి చేరింది. దాదాపు 62 శాతం పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత సరఫరా సమస్యలు తలెత్తి ధరలు మరింత ఎగబాకాయి. భారత్‌ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.

విమానయాన వ్యయాల్లో 40 శాతం వాటా ఇంధనానిదే. దీంతో ఇంధన ధరలు పెరిగినా.. తగ్గినా.. ఆ ప్రభావం విమాన ప్రయాణాలపై ఉంటుంది. ఈ ఏడాది మార్చి 16న గరిష్ఠంగా ఏటీఎఫ్‌ ధరను 18.3 శాతం పెంచారు. ఏప్రిల్‌ 1న రెండు శాతం, ఏప్రిల్‌ 16న 0.2 శాతం, మే 1న 3.22 శాతం చొప్పున ధరలు పెరిగాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ధరలు 10 సార్లు ఎగబాకాయి.

ఇదీ చూడండి:భారీగా తగ్గిన వంట గ్యాస్​​ ధర!

ABOUT THE AUTHOR

...view details