India Post Click N Book Service :భారతీయ తపాలా శాఖ 'క్లిక్ ఎన్ బుక్' పేరుతో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఇకపై మీరు ఇంటి నుంచే స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్స్ సహా పార్సిల్స్ను పంపించుకోవడానికి వీలవుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ తపాలా శాఖ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుని.. కస్టమర్ ఫ్రెండ్లీగా, హై-టెక్ సర్వీసులను అందించడానికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా 'క్లిక్ ఎన్ బుక్' సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఇకపై వినియోగదారులు పోస్టు ఆఫీసుకు వెళ్లకుండానే.. గరిష్ఠంగా 5 కేజీల బరువు వరకు స్పీడ్ పోస్టు, రిజిస్టర్డ్ పోస్టు, పార్సిల్స్ను పంపించుకోవచ్చు. అయితే దీని కోసం వినియోగదారులు ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ www.indiapost.gov.in లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
రిజిస్టర్ చేసుకోండిలా!
How To Send Parcel Through Click N Book Service :
- కస్టమర్లు Click N Book సేవలు పొందాలంటే ముందుగా www.indiapost.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- తరువాత మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో మీరు www.indianpost.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి స్పీడ్ పోస్టు, రిజస్టర్డ్ లెటర్స్, పార్సిల్స్ పంపించుకోవచ్చు.
- ఈ విధంగా మీరు ఇంటిలో ఉంటూనే ఒకసారికి గరిష్ఠంగా 5 లెటర్లు పంపించుకోవచ్చు. అయితే వీటి బరువు 5కేజీల లోపు మాత్రమే ఉండాలి.
ఫ్రీ పికప్ ఫెసిలిటీ!
మీరు కనుక రూ.500 వరకు బుకింగ్ ఛార్జీలు చెల్లిస్తే.. తపాలాశాఖవారు మీ పోస్టులను, లేదా పార్సిల్స్ను పూర్తి ఉచితంగా పికప్ చేసుకుంటారు. ఒక వేళ మీరు చెల్లించిన బుకింగ్ ఛార్జీలు రూ.500 కంటే తక్కువగా ఉంటే.. రూ.50 వరకు పికప్ ఛార్జీలు వసూలు చేస్తారు.