కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 మధ్య భారత్‌లో దాదాపు 32 లక్షల వివాహాలు జరుగుతాయని తెలుస్తోంది. దీని వల్ల రూ.3,75,000 కోట్ల వ్యాపారం జరగనుంది. సీఏఐటీకి చెందిన పరిశోధన విభాగం నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలు విడుదలయ్యాయి.
దేశవ్యాప్తంగా 35 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లు పాల్గొనట్లు సీఏఐటీ వెల్లడించింది. ఈ సీజన్‌లో ఒక్క దిల్లీలోనే దాదాపు 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. దీని వల్ల దేశ రాజధానిలో దాదాపు రూ.75 వేల కోట్ల వ్యాపారం జరగనుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.