Independence Day Spice Jet Offers : భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పైస్‌జెట్ విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పైస్‌జెట్ ఇండిపెండెన్స్ డే సేల్ పేరుతో విమాన టికెట్ ధరలను భారీగా తగ్గించింది. ఇది కేవలం లిమిటెడ్ టైప్ ఆఫర్ అని స్పష్టం చేసింది.
భారీ తగ్గింపు
Spicejet Independence Day Sale : స్పైస్‌జెట్ కేవలం రూ.1515 ప్రారంభ ధరతో విమాన టికెట్లను విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది. పన్నులతో కలిపి ఇంత తక్కువ ధరకే విమాన టికెట్లను అందించడం విశేషం.
స్పైస్‌జెట్ ఈ ఆఫర్‌తో పాటు రూ.2000 విలువైన కాంప్లిమెంటరీ ఫ్లైట్ వోచర్‌ను కూడా అదనంగా అందిస్తోంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్ ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన చోటుకు చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి వీలవుతుంది.
రూ.15కే నచ్చిన సీటు!
"స్పైస్‌జెట్ ఇండిపెండన్స్ డే సేల్ ఆఫర్లను అందిస్తోంది. కనుక ప్రయాణికులు అన్ని పన్నులతో కలిపి కేవలం రూ.1515కే విమానం టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు రూ.2000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్‌ను ప్రయాణికులకు అందిస్తాం. విశేషం ఏమిటంటే, మీకు నచ్చిన సీటును కేవలం రూ.15లకే రిజర్వ్ చేసుకోవచ్చు."
- స్పైస్‌జెట్ ట్వీట్ (ఎక్స్)
లిమిటెడ్ టైమ్ ఆఫర్!
Spicejet Freedom Offers 2023 : స్పైస్‌జెట్ ఈ స్పెషల్ ఆఫర్‌ను కేవలం ఆగస్టు 14 - ఆగస్టు 20 వరకు మాత్రమే అందిస్తోంది. ఈ సమయంలో విమానం టికెట్ బుక్ చేసుకున్నవారు 2023 ఆగస్టు 15 నుంచి 2024 మార్చి 30 వరకు విమాన ప్రయాణం చేయవచ్చు.
లాభం వచ్చింది!
Spicejet Income Statement : స్పైస్‌జెట్ నష్టాల ఊబిలోంచి తేరుకుని.. లాభాలబాట పట్టింది. స్పైస్‌జెట్ సోమవారం తన మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను రూ.205 కోట్ల లాభాలను నమోదు చేసినట్లు స్పైస్‌జెట్ స్పష్టం చేసింది. వాస్తవానికి గతేడాది ఇదే సమయంలో స్పైస్‌జెట్ రూ.789 కోట్ల మేర నష్టాల్లో ఉంది. అయితే ఖర్చులను గణనీయంగా అదుపు చేయడం వల్ల సంస్థ తేరుకున్నట్లు తెలుస్తోంది.
స్పైస్‌జెట్ మాత్రమే కాదు.. వివిధ కంపెనీలు కూడా భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, డోమినోస్ ఇండియా సహా చాలా కంపెనీలు ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్లను ప్రకటించాయి.