తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆధార్- పాన్ అనుసంధానం చేయలేదా?.. ఆ తేదీ తర్వాత మీ కార్డు రద్దు

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఆధార్​తో అనుసంధానం చేయని పాన్​ కార్డులు పనిచేయకుండా పోతాయని ఆదాయ పన్నుశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్​తో పాన్​కార్డుల అనుసంధానం తప్పనిసరని మరోమారు పేర్కొంది.

Income Tax Department has warned that linking of PAN cards with Aadhaar is mandatory
ఆధార్​తో అనుసంధానం చేయని పాన్​ కార్డులు రద్దు

By

Published : Dec 24, 2022, 5:52 PM IST

ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ కార్డులు వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పనిచేయకుండా పోతాయని కేంద్ర ఆదాయ పన్నుశాఖ హెచ్చరించింది. పాన్‌తో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరని మరోమారు స్పష్టం చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలని ట్విట్టర్ వేదికగా సూచించింది. 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. మినహాయింపునకు రాని వారందరూ 2023 మార్చి 31 నాటికి అనుసంధాన ప్రక్రియను ముగించాలని హితవు పలికింది.

అలా చేయని పక్షంలో సంబంధిత పాన్‌ కార్డులు ఏప్రిల్‌ 1నుంచి నిరూపయోగంగా మారతాయని స్పష్టం చేసింది. 2017 మే లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం.. అసోం, మేఘాలయా, జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ఈ అనుసంధాన ప్రక్రియ నుంచి మినహాయింపు లభిస్తుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details