Inactive Savings Account :కారణాలు ఏవైనా కావొచ్చు.. కొందరు ఐదారు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేస్తారు. కానీ.. వాటిలో రెగ్యులర్‌గా వాడేవి ఒకటి లేదా రెండు అకౌంట్లు మాత్రమే ఉంటాయి. అవసరం తీరిపోయిన తర్వాత.. మిగిలిన అకౌంట్లను పట్టించుకోరు. అలాగనీ అధికారికంగా క్లోజ్ చేయరు. అలా వదిలేస్తారు. కానీ.. బ్యాంకును బట్టి అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయినప్పటికీ.. ఆ ఖాతాను ఆపరేట్ చేయకపోతే.. కొంత కాలం తర్వాత ఇన్‌యాక్టివ్ మోడ్‌లోకి వెళ్తుంది. అసలు ఇన్‌యాక్టివ్ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి..? దాని వల్ల నష్టాలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మంచిది?
ఇన్‌యాక్టివ్ సేవింగ్స్ ఖాతా అంటే ?: 12 నెలల వ్యవధిలో ఎటువంటి లావాదేవీలు నిర్వహించకపోతే.. ఆ ఖాతాను ఇన్‌యాక్టివ్ సేవింగ్స్ అకౌంట్ అంటారు. ఉదాహరణకు మీరు 2022 జనవరిలో ఓ ట్రాన్సాక్షన్ చేశారనుకుందాం. మళ్లీ 2023 జనవరి లోపు ఒక్క ట్రాన్స్క్షన్ కూడా చేయకపోతే.. మీ అకౌంట్ ఇన్‌యాక్టివ్ స్టేట్లోకి వెళ్లిపోతుంది. ఖాతా ఎక్కువ కాలం ఇన్‌యాక్టివ్‌గా ఉంటే పెనాల్టీ విధిస్తారు. ఇన్‌యాక్టివ్ ఖాతాల విషయంలో.. బ్యాంకును బట్టి రూల్స్ మారే అవకాశం ఉంది.
అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే ఏం జరుగుతుంది..?
- ఒక ఖాతా ఎక్కువ కాలం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే.. బ్యాంకు నిబంధనల ప్రకారం.. ఆ అకౌంట్లోని డబ్బును స్టేట్ అన్క్లైయిమ్డ్ ప్రాపర్టీ డివిజన్‌కు బదిలీ చేస్తారు.
- భవిష్యత్తులోఖాతా యజమాని లేదా వారి వారసుల ద్వారా నిధులను రీక్లెయిమ్ కోసం ఇది ఉపయోగపడుతుంది.
- ఖాతా ఇన్‌యాక్టివ్ అయినందుకు.. ఎక్కువగానే ఫైన్ చెల్లించాల్సి రావొచ్చు.