Important Things To Consider Before Taking Gold Loan : భారతీయ సంస్కృతిలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ బంగారం.. సంపదకు, శ్రేయస్సుకు ప్రతీకగా ఉంటుంది. దీనికి ద్రవ్య విలువ ఉంటుంది కనుక మన ఆర్థిక భద్రతకు భరోసా ఉంటుంది. అంతేకాదు అత్యవసర సమయాల్లో మనల్ని ఆదుకుంటుంది. సులువుగా రుణాలు పొందడానికి వీలుకల్పిస్తుంది.
బంగారు రుణాలు!
How To Get Gold Loan Easily : బ్యాంకులు బంగారంపై ఇచ్చే రుణాలను.. సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తుంటాయి. అంతేకాదు బంగారాన్ని హామీగా ఉంచుకుని చాలా వేగంగా రుణాలను మంజూరు చేస్తాయి. కనుక రుణగ్రహీతలు తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి సులువుగా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.
నగదుగా మార్చుకోవచ్చు!
How To Convert Gold To Cash :ఇతర ఆస్తుల మాదిరిగా కాకుండా, బంగారాన్ని త్వరగా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. తాకట్టు పెట్టి అప్పు తీసుకోవచ్చు.
రుణం ఎంత ఇస్తారంటే?
Gold Loan Per Gram Rate Today :బ్యాంకులు బంగారం విలువలో నిర్ణీత శాతాన్ని రుణంగా ఇస్తాయి. సాధారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. కనుక మీ బంగారం విలువను క్రమం తప్పకుండా మూల్యాంకనం చేసుకోవాలి. బంగారం విలువ పెరిగినప్పుడు.. బ్యాంకు లోన్ కోసం వెళితే, అధిక మొత్తంలో రుణం పొందడానికి వీలవుతుంది.
తక్కువ వడ్డీకే రుణం
How To Get Gold Loan At Low Interest Rate : బంగారు రుణాలు సురక్షితం. కనుక, రుణదాతలకు నష్టభయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలతో పోలిస్తే.. బంగారు రుణాల వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అయితే ఆయా రుణ సంస్థలను అనుసరించి ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.