ICICI Bank Festive Offers : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్.. తమ కస్టమర్ల కోసం పండుగ ఆఫర్స్ ప్రకటించింది. ముఖ్యంగా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగించి.. వస్తువులు కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.26,000 వరకు డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ అందిస్తోంది. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసేవారికి కూడా ఇదే విధమైన బెనిఫిట్స్ అందిస్తోంది. పైగా కార్డ్‌లెస్ ఈఎంఐ, నో-క్యాష్ ఈఎంఐ సౌకర్యాలు కూడా కల్పిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా 'పండుగ సీజన్లో మా ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల కోసం బంపర్ బొనాంజా ప్రకటించాం. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నీటర్, ట్రావెల్, డైనింగ్ సహా పలు రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ అందిస్తున్నాం. అలాగే యాపిల్, మేక్ మై ట్రిప్, టాటా న్యూ, వన్‌ప్లస్, హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జీ, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, జొమాటో, స్విగ్గీ కొనుగోళ్లుపై కూడా అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్నాం' అని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
బిగ్ డీల్స్ :
- మింత్రా అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 19 వరకు బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.
- ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు బిగ్ బిలియన్ డేస్ నిర్వహిస్తోంది.
- అమెజాన్ అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుపుతోంది.
- వీటన్నింటితోనూ ఐసీఐసీఐ బ్యాంక్ సహ భాగస్వామ్యం కలిగి ఉంది. కనుక ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు.. భారీగా బ్యాంక్ డిస్కౌంట్స్, ఆఫర్స్, క్యాష్‌బ్యాక్స్ లభిస్తాయి.
Best Smartphone Offers In October 2023 : రూ.10 వేలకే ఐఫోన్.. 89% డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్స్.. డీల్స్ అదుర్స్ గురు!
Festival Offers In October 2023 : దసరా పండుగ సేల్స్.. ఫ్యాషన్ & బ్యూటీ ప్రొడక్టులపై 90%.. స్మార్ట్ఫోన్లపై 80% డిస్కౌంట్స్!
ఐసీఐసీఐ - లోన్ ఆఫర్స్
ICICI Bank Loan Offers In October 2023 : ఐసీఐసీఐ బ్యాంక్ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేసింది. అందులో భాగంగా హోంలోన్స్, ఆటో లోన్స్, టూ-వీలర్ లోన్స్‌పై స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటించింది. వాటి పూర్తి వివరాల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్స్ :
ICICI Bank Discounts And Cashbacks In October 2023 :
- టాటా క్లిక్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఉపయోగించి, లేదా యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కొనుగోలు చేస్తే 15% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
- శాంసంగ్, సోనీ, యురేకా ఫోర్బ్స్, ఎల్జీ, వర్ల్‌పూల్ లాంటి టాప్ బ్రాండ్ ఎలక్ట్రానిక్ వస్తువులపై గరిష్ఠంగా రూ.26,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
- Bose బ్రాండ్ స్పీకర్లపై 10% డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.6000 వరకు); ఎంపిక చేసిన JBL ప్రొడక్టులపై 25% (గరిష్ఠంగా రూ.12,000 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది.
- రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ లాంటి స్టోర్స్‌లో.. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ కొనుగోళ్లుపై డిస్కౌంట్ అందిస్తారు.
- యాపిల్, మోటోరోలా, ఒప్పో, వన్‌ప్లస్, షావోమీ, రియల్మీ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సహా, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభిస్తుంది.
- లైఫ్‌స్టైల్, ఫాస్ట్‌ట్రాక్, సెంట్రో లాంటి ఫ్యాషన్ బ్రాండ్ కొనుగోళ్లుపై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ దొరుకుతుంది.
- పెప్పర్ఫ్రై, డ్యూరోఫ్లెక్స్, అర్బన్ లేడర్ లాంటి బ్రాండెడ్ గృహోపకరణాలు కొంటే.. 10% వరకు డిస్కౌంట్ అందిస్తారు.
- జొమాటో, స్విగ్గీ, ఈజీడిన్నర్, మెక్‌డొనాల్డ్స్, సోనీ లివ్ లాంటి యాప్ సబ్‌స్క్రిప్షన్స్‌లో కూడా డిస్కౌంట్స్ లభిస్తాయి.
- యాత్రా, క్లియర్‌ట్రిప్, మేక్ మై ట్రిప్ లాంటి ట్రావెల్ సైట్స్‌లో కూడా ఐసీఐసీఐ కార్డ్స్ ద్వారా సొమ్ము చెల్లిస్తే.. బంపర్ ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ లభిస్తాయి.
- ఐఫోన్ 15 కొనుగోలుపై నో-కాస్ట్ ఈఎంఐ స్పెషల్ ఆఫర్ కూడా లభిస్తుంది.
Mahendra Car Discounts In October 2023 : పండగకు కొత్త కారు కొనాలా?.. మహీంద్రా కార్లపై రూ.1.25 లక్షల డిస్కౌంట్.. ఉచిత యాక్సెసరీస్ కూడా..
2023 Hero Glamour 125 Price : స్టైలిష్ లుక్స్‌తో హీరో గ్లామర్ 2023.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!