Hyundai Creta Facelift 2024 :హ్యుందాయ్ కంపెనీ 2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ క్రెటా కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఈ నయా కారు ముందు భాగం డిజైన్లోనూ సరికొత్త మార్పులు చేసింది. ఇంటీరియర్‌లోనూ అనేక కొత్త ఫీచర్లను ఏర్పాటుచేసింది. అంతేకాదు ఈ కారులో లెవెల్-2 ADAS టెక్నాలజీని పొందుపరిచింది.
Hyundai Creta Features : వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న హ్యూందాయ్ కొత్త మోడల్ కారులో ఆధునాతన భద్రత ప్రమాణాలను జోడించారు. ఇందులో ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ కొలిషన్ వార్నింగ్ & అవాయిడెన్స్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రియర్ క్రాస్ ఉన్నాయి.
అంతే కాకుండా, ఫేస్ లిఫ్టెడ్ క్రెటాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సీట్లపై సీట్‌బెల్ట్‌లు, EBD, ESC, టైర్ ప్రెజర్ మానిటర్, పార్కింగ్ సెన్సార్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి చాలా ఫీచర్లతో మార్కెట్లోకి క్రెటా వస్తుంది. ఇవే కాకుండా ఇతర సౌకర్యాలు చాలానే ఉన్నాయి. 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇక డిజైన్ పరంగా మన దేశ మార్కెట్ కోసం ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్, బాక్సియర్ హెడ్ లైట్ ఏర్పాటు చేశారు. దీనివల్ల స్లాట్డ్ గ్రిల్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వెనుక భాగం స్ప్లిట్-LED టెయిల్ ల్యాంప్‌లతో అద్భుతంగా కనిపిస్తోంది. ఇది ఆడి వంటి డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లను తెలియజేస్తోంది.