తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫోన్​ లాక్​ చూసి.. మీ వయసు చెప్పేస్తాం' - వయసు

స్మార్ట్​ఫోన్లకు వేసే లాక్​ విధానాన్ని బట్టి వయసు చెప్తామంటోంది ఓ సరికొత్త అధ్యయనం. ఈ పరిశోధనలో ఆయా వయసుల వారు తమ స్మార్ట్​ ఫోన్లకు ఎలాంటి లాక్​ వేయడానికి ఇష్టపడతారో వివరించింది. కెనడాలోని బ్రిటిష్​ కొలంబియా విశ్వవిద్యాలయం ఈ అధ్యయనం చేసింది.

'ఫోన్​ లాక్​ చూసి.. మీ వయసు చెప్పేస్తాం'

By

Published : Jun 20, 2019, 5:10 PM IST

ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్​ఫోన్లకు లాక్​ వేస్తుంటారు. ఇది సర్వసాధారణం. అయితే తాజా అధ్యయనం ఒకటి... స్మార్ట్​ ఫోన్​కు వేసే లాక్​ విధానంతో వారి వయసు అంచనా వేయొచ్చని తేల్చింది. కెనడాలోని బ్రిటిష్​ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనం ప్రకారం స్మార్ట్​ఫోన్​ వాడే వయోవృద్ధులు ఎక్కువ శాతం ఆటోమేటిక్​ లాక్​ వైపే మొగ్గు చూపుతున్నారట. అలానే ఫింగర్​ప్రింట్​ లాక్​లనూ వినియోగిస్తారని నివేదికలో పేర్కొంది. ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో, ఇంట్లో ఉండేటప్పుడే మాత్రమే వారు చరవాణులను అన్​లాక్​ చేస్తారట. అలానే యువత కంటే వీరి ఫోన్​ వినియోగ సమయం చాలా తక్కువని పరిశోధకులు తెలిపారు.

అధ్యయనం ఎలా..?

19 నుంచి 63 ఏళ్ల వయసు కలిగిన 134 మందిపై ఈ అధ్యయనం చేశారు. 2 నెలల పాటు వీరి చరవాణుల్లో ప్రత్యేక యాప్​ను ఇన్​స్టాల్ చేసి లాక్​, అన్​లాక్​ విషయాల వివరాలు, ఆటో, మాన్యువల్ లాక్ ఎంపిక వంటి వివరాలను సేకరించారు. అధ్యయనంలో ముఖ్యాంశాలు..

⦁ 25 ఏళ్ల వయసు కలిగిన వారు రోజులో సుమారు 20 సార్లు వారి ఫోన్​ వినియోగిస్తారు.

⦁ 35 ఏళ్ల వయసు వారు సుమారు 15 సార్లే వారి చరవాణి వాడతారట.

⦁ మహిళల కంటే పురుషులు ఎక్కువ మంది ఆటోలాక్​ ఇష్టపడతారట.

⦁ 20వ పడిలో ఉన్న అమ్మాయిలు.. వారి వయసు అబ్బాయిల కన్నా ఎక్కువ సమయం చరవాణి వినియోగిస్తారని అధ్యయనం తెలిపింది.

⦁ 50లలో ఉన్న వారిలో మహిళల కన్నా పురుషులే అత్యధికంగా ఫోన్​​ వినియోగిస్తున్నట్లు తేలింది.

స్మార్ట్​ఫోన్లను తయారు చేసే సంస్థలకు ఈ నివేదిక ఉపకరిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ వివరాల ద్వారా ఆయా వయస్కుల వారికి అనుగుణంగా కొత్త స్మార్ట్​ ఫోన్లు తయారు చేయవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details