How to Withdraw Cash from ATM without Debit Card :ఇప్పుడు జనాలు డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లట్లేదు. ఏటీఎం సెంటర్లోకి వెళ్తున్నారు. అయితే.. కొన్నిసార్లు హడావుడిగా ఏదో పని మీద వెళ్తుంటాం. సడన్‌గా మనీ అవసరం పడుతుంది. తీరా జేబులో చూస్తే డెబిట్ కార్డు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డబ్బు డ్రా చేసేందుకు ఆర్‌బీఐ(Reserve Bank of India) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు.. ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. అది ఎలాగో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Cardless Cash withdraw at ATMs in Telugu : మొబైల్ ఫోన్ సాయంతో ఏటీఎంలలో డబ్బు తీసుకొనే సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా అన్ని ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణను (Cardless Cash Withdrawal) ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా మీరు డెబిట్ కార్డు లేకపోయినా ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే గూగుల్‌పే, ఫోన్ పే(Phone Pay)వంటి యూపీఐ యాప్స్‌తో పాటు ఆయా బ్యాంక్ యాప్స్‌ను సైతం దీనికి వినియోగించొచ్చు. ఒకవేళ మీరు ఎస్‌బీఐ వినియోగదారులైతే.. యోనో, ఐసీఐసీఐ బ్యాంక్ హోల్డర్లయితే ఐమొబైల్ యాప్‌ను వినియోగించి కూడా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.
UPI ATM Cash Withdrawal Process : 'యూపీఐ ఏటీఎం'తో.. ఇకపై కార్డ్ లేకుండానే క్యాష్ విత్‌డ్రా!
How to withdraw Money from ATM without Card :
డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవచ్చంటే..
- ముందుగా మీరు ఏ ఏటీఎంకు వెళ్తారో అక్కడ UPI సదుపాయం పనిచేస్తుందో లేదో చూసుకోవాలి.
- ఆ తర్వాత మీ ఫోన్‌లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై విత్‌డ్రా సెక్షన్‌లో QR Cash అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు తాత్కాలిక క్యూఆర్ కోడ్ అక్కడ జనరేట్ అవుతుంది.
- ఆ తర్వాత మీరు ఉపయోగించే యూపీఐ యాప్‌లోని QR code scanner ఆప్షన్ ఉపయోగించి ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
- ఎంత నగదు కావాలో.. దానిపై ఎంటర్ చేయాలి.
- ఇక చివరగా మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీ పూర్తి అవుతుంది.
- డబ్బులు ఏటీఎం మెషీన్లోంచి వచ్చేస్తాయి.
Cardless Cash Withdrawal Process :యూపీఐ ఆధారంగా ఏటీఎంలో నెలకు రూ.లక్ష వరకు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాంకుల నియమ నిబంధనల ఆధారంగా రోజువారీ విత్‌డ్రా పరిమితులు ఉంటాయనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఈ విత్‌డ్రా సమయంలో ఏదైనా అంతరాయం ఎదురై ఒకవేళ డబ్బు రాకపోతే వెంటనే దగ్గర్లో ఉన్న బ్యాంక్‌లో తెలియజేయాలి. దీంతో కొద్దిరోజుల్లోనే ఆ డబ్బు తిరిగి మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఇలా విత్ డ్రా చేయడం వల్ల పిన్ టైప్ చేయం కాబట్టి.. కార్డు క్లోనింగ్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
గూగుల్‌పే, ఫోన్‌పే చేస్తున్నారా? ఇలా మోసపోవచ్చు! బీ అలర్ట్!!
గూగుల్ పే, పేటీఎంతో.. ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా... ఎలాగంటే?