How to Use UPI Lite in UPI Apps in Telugu :నేటి ఆధునిక కాలంలో యూపీఐ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న మొత్తాలకూ ఇప్పుడు యూపీఐని వినియోగించడం సర్వ సాధారణమైంది. టీ తాగిన దగ్గర నుంచి ఏ చిన్న వస్తువు కొన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంకు ఖాతాలోని డబ్బులు చెల్లిస్తున్నాం. ఈ మనీ చెల్లించే క్రమంలో మనం యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ యూపీఐ చెల్లింపులు మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(NPCI) 'యూపీఐ లైట్'(UPI Lite) అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ఎన్పీసీఐ ప్రవేశపెట్టింది. దీనిని 'ఆన్-డివైస్ వాలెట్' అని కూడా పిలుస్తారు. మొదట 'యూపీఐ లైట్'(UPI Lite)ఫీచర్‌ను పేటీఎం, ఫోన్‌పేలో తీసుకురాగా తర్వాత గూగుల్ పేలోనూ దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ 'యూపీఐ లైట్' అంటే ఏమిటి? దీనిని గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంలలో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
What is UPI Lite in Telugu :
యూపీఐ లైట్ అంటే ఏమిటంటే..చిన్నమొత్తాల డిజిటల్ చెల్లింపుల కోసం ఎన్పీసీఐ తీసుకొచ్చిన ఫీచర్ ఈ యూపీఐ లైట్ (UPI Lite). మనం సాధారణంగా యూపీఐ యాప్‌ల ద్వారా పేమెంట్ చేయాలంటే పిన్ తప్పనిసరి. ఈ ఫీచర్‌ను మన యూపీఐ యాప్‌లలో(గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం) యాక్టివేట్ చేసుకుంటే సింగిల్ క్లిక్‌తో పిన్ ఎంటర్ చేయకుండానే చెల్లింపులు జరపవచ్చు. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా వ్యాలెట్‌లో కొంత మొత్తం డబ్బు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గరిష్ఠంగా ఒకేసారి రూ.2 వేల వరకు అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఒక రోజులో రెండుసార్లు చొప్పున మొత్తం 4వేల రూపాయలు ఈ వ్యాలెట్‌లో లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.
UPI Lite Benefits :అయితే సాధారణ యూపీఐ లావాదేవీలలో రోజువారీ పరిమితి రూ.1 లక్ష ఉంటే ఇందులో పేమెంట్ పరిమితి మొదట రూ.200గా ఉంటే ఇటీవల రూ.500కు పెంచారు. అంటే ఒకసారి రూ.500 వరకూ లావాదేవీని సింగిల్ క్లిక్‌తో పూర్తి చేయొచ్చు. ఒకవేళ బ్యాంక్ సేవల్లో అంతరాయం ఉన్నా ఈ ఫీచర్‌తో పేమెంట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పైగా సత్వరమే దీని ద్వారా మీరు చేయాలనుకున్న లావాదేవీ పూర్తి చేయొచ్చు. ఇప్పుడు యూపీఐ యాప్(UPI Apps)లలో ఈ ఫీచర్ ఎలా యాక్టిపేట్ చేసుకోవాలో చూద్దాం..
How to Activate UPI Lite on Google Pay in Telugu :