How to Use Company Insurance After Lost Job : ఈ రోజుల్లో మాగ్జిమమ్ కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తున్నాయి. భార్యాభర్తలు, పిల్లలకు కలిపి కంపెనీలు బీమా కమవరేజీ అందిస్తుంటాయి. ఇంతవరకూ బాగానే ఉంటుంది. కానీ.. అనివార్య కారణాలతో ఉద్యోగులు తమ జాబ్ వదులుకోవాల్సి రావొచ్చు. కంపెనీ తొలగించడమో, లేదంటే.. ఉద్యోగులే రాజీనామా చేయడమో జరగొచ్చు. ఉద్యోగం పోయింది కాబట్టి.. సదరు కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ కూడా పోయినట్టేనని చాలా మంది ఉద్యోగులు భావిస్తారు. కానీ.. మరో మార్గం ఉంది. ఉద్యోగం వదిలినప్పటికీ.. కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. మరి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
IRDAI ఏమంటోంది..?
Insurance Regulatory and Development Authority Rule :ఒక ఉద్యోగి ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో నుంచి బయటకు వెళ్లినప్పుడు.. ఆ కంపెనీ ఇచ్చిన హెల్త్ పాలసీని వ్యక్తిగత లేదా కుటుంబ పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి.. ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) ఉద్యోగులకు కీలక అవకాశం కల్పించింది. "ఉద్యోగం వదిలిన ఎంప్లాయ్ ఎవరైనా.. కంపెనీ ఇచ్చిన గ్రూప్ ఇన్సూరెన్స్‌ను ఇండివిడ్యువల్ లేదంటే ఫ్యామిలీ కవర్ పాలసీగా మార్చుకోవచ్చు" అని IRDAI క్లియర్‌గా చెప్పింది.
45 రోజుల ముందే తెలియజేయాలి
Inform Before Last 45 Days of Working :అయితే.. ఇందుకోసం ఉద్యోగి కొన్ని పనులు తప్పక చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం వదిలి వెళ్లడానికి ముందే.. ఈ విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కంపెనీలో పనిచేస్తుండగానే.. ఉద్యోగం వదిలి వెళ్లే చివరి 45 రోజుల ముందు ఈ పాలసీని పోర్టబిలిటీ పెట్టుకోవచ్చు. అంటే.. ఉద్యోగం మానేసినప్పటికీ.. కాలపరిమితి వరకు ఇన్సూరెన్స్ కొనసాగేలా పోర్ట్ పెట్టుకోవచ్చన్నమాట. ఈ మేరకు సదరు ఉద్యోగి.. ఇన్సూరెన్స్ కంపెనీకి లెటర్ పెట్టుకోవాలి.