తెలంగాణ

telangana

ETV Bharat / business

10 ఏళ్లుగా ఆధార్​​ అప్డేట్​ చేయలేదా? ఆన్​లైన్​లో ఫ్రీగా వివరాలు మార్చుకోండిలా! - Why Aadhaar updation is mandatory

How To Update Aadhaar Card Online In Telugu : 10 ఏళ్లుగా ఆధార్ కార్డు వివరాలను అప్డేట్​ చేసుకోనివారి కోసం మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటికీ ఆధార్​లో తమ వ్యక్తిగత వివరాలు మార్చుకోనివారు.. డిసెంబర్​ 14లోపు ఆన్​లైన్​లో ఉచితంగా మార్చుకోవచ్చు. మరి ఆన్​లైన్​లో ఫ్రీగా ఆధార్​ కార్డ్​ను ఎలా​ అప్డేట్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా?

How To Update Aadhaar Card Online
Aadhaar Card Free Update

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 3:25 PM IST

How To Update Aadhaar Card Online : ఆధార్​ కార్డ్​ తీసుకొని 10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ సమయం గడిచిందా? అయినా ఇంకా ఆధార్​ వివరాలను అప్డేట్​ చేయలేదా? అలాంటివారి కోసమే ఇంకో అవకాశం ఇచ్చింది భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI). ఇంతకు ముందు ఆధార్​ అప్డేట్​ కోసం రూ.50 రుసుము చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఎవరైతే తమ ఆధార్ వివరాలను అప్డేట్​ చేసుకోలేదో.. వారు డిసెంబర్​ 14లోపు ఆన్​లైన్​లో ఫ్రీగా సదరు వివరాలను మార్చుకోవచ్చు. అందుకే ఆన్​లైన్​లో ఉచితంగా ఆధార్​ కార్డ్​ను ఎలా అప్డేట్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమేమి మార్చుకోవచ్చు..?
Aadhaar update Details :ఫొటో, వేలిముద్రలు, ఐరిస్​, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా, మొబైల్​ నంబర్​, ఇంటి పేరు, లింగం సహా ఇతర వివరాలను బయోమెట్రిక్ ద్వారా అప్డేట్​ చేసుకోవచ్చు. అయితే ఫొటోగ్రాఫ్​, ఐరిస్​ లాంటి బయోమెట్రిక్స్ అప్​డేట్ చేసుకోవడానికి దగ్గరల్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించి, అందుకు తగ్గ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఫింగర్ ప్రింట్స్​, ఐరిస్ లాంటి బయోమెట్రిక్స్​ సేకరించేందుకు కొన్ని ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాదు బయోమెట్రిక్స్ నమోదులో ఎలాంటి మోసాలు​ జరగకుండా వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటికి కొంత ఖర్చు అవుతుంది. అందుకే అందుకు తగిన రుసుమును ఆధార్ కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్ అప్డేట్​ ఎందుకు అవసరం?
Why Aadhaar Update Is Mandatory :UIDAI నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. దీని వల్ల వ్యక్తుల డేటా అక్యురేట్​గా, అప్​-టు-డేట్​గా ఉంటుంది.

సాధారణంగా భారతదేశంలో అమ్మాయిలకు పెళ్లి అయిన తరువాత వారి చిరునామా, ఇంటి పేర్లు మారుతూ ఉంటాయి. కొందరు ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి తరలివెళ్తుంటారు. ఇలాంటి వారందరూ తమ ఆధార్​ వివరాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు మన ఫోన్ నంబర్​, ఈ-మెయిల్స్ కూడా మారుస్తూ ఉంటాం. కనుక ఆ వివరాలను సైతం ఆధార్​లో అప్​డేట్ చేయాల్సి ఉంటుంది.

ఆన్​లైన్​లో ఆధార్​ కార్డ్ అప్డేట్​ ఇలా..
How To Update Aadhaar Card Online :

  • ముందుగా మీరు UIDAI వెబ్​సైట్​ uidai.gov.inలోకి లాగిన్​ అవ్వండి.
  • రిజిస్ట్రేషన్​ కోసం లాగిన్​ ఐడీ, పాస్​వర్డ్​ను క్రియేట్​ చేసుకోండి.
  • తరువాత 'My Aadhaar' ట్యాబ్​పై క్లిక్​ చేసి 'Update Your Aadhaar' ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోండి.
  • ఇప్పుడు మీ ఆధార్​ సంఖ్యను ఎంటర్​ చేయండి. దీంతో పాటు వెరిఫికేషన్​ కోసం బాక్స్​లో చూపించే Captcha కోడ్​ను టైప్​ చేయండి. అంతరం 'Send OTP'పై క్లిక్​ చేయండి.
  • మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​కు వచ్చిన ఓటీపీ సంఖ్యను ఎంటర్​ చేసి 'Login' అవ్వండి.
  • ఇప్పుడు మీరు మార్చుకోవాలనుకుంటున్న వివరాలను.. ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేసి Submit బటన్​ను నొక్కండి.
  • మీరు అప్డేట్​ చేయాలనుకుంటున్న వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్​ను స్కాన్​ చేసి అప్​లోడ్​ చేయండి.
  • ప్రక్రియను పూర్తి చేసేందుకు 'Submit Update Request'పై క్లిక్​ చేయండి.
  • అనంతరం మీ మొబైల్​కు 'Update Request Number' (URN) వివరాలు మెసేజ్​ రూపంలో వస్తాయి. ఆ URNను జాగ్రత్తగా నోట్​ చేసుకోండి. మీ అప్డేట్​ స్టేటస్​ను​ ట్రాక్​ చేసేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుంది.
  • మీ అప్డేట్​ రిక్వెస్ట్​కి సంబంధించిన స్టేటస్​ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇందుకోసం myaadhaar.uidai.gov.in/సైట్​ను వీక్షించవచ్చు.
  • ఇందులోకి లాగిన్​ అయిన తర్వాత 'Check Enrolment & Update Status' సెక్షన్​లో మీ మొబైల్​ నంబర్​కు వచ్చిన URN నంబర్​ను ఎంటర్​ చేయండి.
  • ఇక్కడ మీ అభ్యర్థనకు సంబంధించిన స్టేటస్​ వివరాలను తెలుసుకోవచ్చు.

ఆధార్​తో ఇంటర్నేషనల్​ మొబైల్ నంబర్​ లింక్ చేయవచ్చా?

11.5 కోట్ల పాన్ కార్డ్స్ కట్ - అందులో మీది ఉందా? చెక్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details