తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Unblock Your SBI ATM Card : SBI ATM కార్డును.. అన్‌బ్లాక్ ఎలా చేయాలి..? - SBI ఏటీఎం కార్డు ఎందుకు బ్లాక్ అవుతుంది

How to Unblock Your SBI ATM Card : ఒక్కోసారి వినియోగదారులు చేసే పొరపాట్ల వల్ల SBI ATM కార్డ్ బ్లాక్ అవుతుంది. మరి, బ్లాక్ అయిన ATM కార్డును తిరిగి యాక్టివేట్ చేయొచ్చా? అందుకోసం ఎలాంటి పద్ధతులు పాటించాలి??

Unblock Your SBI ATM Card Like This
How to Unblock Your SBI ATM Card

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 11:13 AM IST

Unblock Your SBI ATM Card Like This : అనుకోకుండా చేసే పనుల వల్ల ఒక్కోసారి ATM కార్డు బ్లాక్ అయిపోతుంది. మరి, అలాంటి పరిస్థితుల్లో తిరిగి అన్ బ్లాక్ చేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి పద్ధతుల ద్వారా తిరిగి రియాక్టివేట్ చేయొచ్చు? ఎలాంటి కారణాలతో ఏటీఎం బ్లాక్ అవుతుంది? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

SBI ATM కార్డ్ ఎప్పుడు బ్లాక్ అవుతుంది?

When SBI ATM Card will Block :

పలు కారణాలతో ఏటీఎం కార్డ్ బ్లాక్ అయ్యేందుకు అవకాశం ఉంది. ATM పిన్ వరుసగా మూడు సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే.. కార్డ్ బ్లాక్ అవుతుంది. ఈ కారణం వల్ల బ్లాక్ అయితే.. 24 గంటలపాటు ఏటీఎం కార్డ్ పనిచేయదు. అంటే.. ఇది తాత్కాలిక బ్లాక్ అన్నమాట.

మరో కారణం వల్ల కూడా కార్డ్ బ్లాక్ అవుతుంది. ఏటీఎం కార్డ్ వెనక భాగంలో ఎక్స్​పైరీ డేట్ ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. ఆ గడువు ముగిస్తే కార్డ్ బ్లాక్ అవుతుంది. మీరు ఇచ్చిన అడ్రస్​ కు బ్యాంక్ కొత్త కార్డ్ పంపిస్తుంది. ఇవేకాకుండా.. ఇంకా పలు కారణాలతో.. ఏటీఎం కార్డ్ బ్లాక్ కావొచ్చు. ఈ పరిస్థితుల్లో తిరిగి అన్ బ్లాక్ ఎలా చేయాలో చూద్దాం.

YONO యాప్ ద్వారా అన్ బ్లాక్ చేయొచ్చు..

Unblock SBI ATM Card Through YONO App :

ఇందుకోసం మొదటగా మీ ఫోన్​లో YONO యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోండి

MPIN ఉపయోగించి లాగిన్ చేయండి

కిందికి స్క్రోల్ చేసిన తర్వాత.. సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

తర్వాత ATM/డెబిట్ కార్డ్ ఎంపికను సెలక్ట్ చేయండి

మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ ఇవ్వండి

ఆ తర్వాత Submit బటన్ పై క్లిక్ చేయండి

అనంతరం యాక్టివ్ కార్డ్‌పై క్లిక్ చేయండి

ఆ తర్వాత అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి

ఇప్పుడు, కార్డ్ నంబర్‌ ఎంటర్ చేయండి

అనంతరం Next క్లిక్ చేయండి

ఫోన్​కు ఓటీపీ వస్తుంది. దాన్ని సమర్పిస్తే సరిపోతుంది.

YONO వెబ్ సైట్ ద్వారా..

Unblock SBI ATM Card Through YONO Website :

ముందుగా YONO వెబ్‌సైట్‌ https://sbi.co.in/web/yono/ లోకి వెళ్లాలి.

మీ యూజర్ నేమ్.. పాస్‌వర్డ్ ఉపయోగించి సైన్ ఇన్ కావాలి.

తర్వాత "Quick Links" అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

"Emergency" విభాగం కింద.. "Block Debit Card"పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు.. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేసి, "Activate Card"పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీ ATM కార్డ్ నంబర్.. ఇంకా మీ మొబైల్ నంబర్​కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.

చివరగా.. "Submit" ఆప్షన్​ పై క్లిక్ చేయాలి.

కొన్ని నిమిషాల్లోనే కార్డ్ యాక్టివేట్ అవుతుంది.

కస్టమర్ కేర్​కు ఫోన్ చేయడం ద్వారా..

Unblock SBI ATM Card Through Customer Care :

SBI కస్టమర్ కేర్ నంబర్​కు ఫోన్ చేసి కూడా ATM కార్డ్‌ని అన్‌బ్లాక్ చేయించుకోవచ్చు

SBI కస్టమర్ కేర్ నంబర్-1800112211, 18004253800

అయితే.. కస్టమర్ కేర్ నుంచి పలు ప్రశ్నలు అడుగుతారు.

మీ సమాచారాన్ని ధ్రువీకరించుకుంటారు.

మీ సమాధానాలతో సంతృప్తి చెందితే వెంటనే అన్ బ్లాక్ చేస్తారు.

శాశ్వతంగా బ్లాక్ అయితే..

What to Do if SBI ATM Card is blocked permanently?

పైన చెప్పుకున్న పద్ధతులు.. ATM కార్డు తాత్కాలికంగా బ్లాక్ అయినప్పుడు మాత్రమే తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

కానీ.. SBI వారు శాశ్వతంగా బ్లాక్ చేస్తే మాత్రం ఏ విధంగా కూడా అన్ బ్లాక్ చేయలేరు.

మీ బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదించాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details