IRCTC Auto Upgradation Scheme Details in Telugu: మరో నెలలో దసరా సెలవులు రాబోతున్నాయి. దీంతో చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్లాలనుకుంటారు. లేదా ఫ్యామిలీతో కలిసి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఇందుకోసం.. మెజారిటీ జనం ఎంచుకునే రవాణా సాధనం.. రైలు బండి. ముందే ప్లాన్ చేసుకుంటే.. రైలు టికెట్ సులువుగానే దొరుకుతుంది. కానీ.. చివరి నిమిషంలో బుకింగ్ చేసుకునేవాళ్లకే టికెట్ దొరుకుతుందా లేదా అన్న టెన్షన్ తప్పదు. అయితే.. ఆ టెన్షన్ నుంచి IRCTC కాస్త రిలీఫ్ ఇచ్చింది. ప్రయాణికులకు ఊరట కలిగించడానికి ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. మరి, ఈ స్కీమ్ ఏంటి..? దీనివల్ల ఎవరికి లాభం..? నిబంధనలు ఏంటి..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
How to Book IRCTC Tatkal Tickets : తత్కాల్ టికెట్లు.. ఎలా బుక్ చేయాలో తెలుసా..?
ఆటో అప్‌గ్రేడేషన్ అంటే..?
What is Auto Upgradation..?..ఇప్పటి వరకూ.. రిజర్వేషన్ ద్వారా ప్రయాణికులు తాము ఎంచుకున్న కోచ్‌లోనే బెర్త్ లభిస్తోంది. ఒకవేళ ఆ బోగీలో బెర్త్ లేకపోతే.. రిజర్వేషన్ క్యాన్సిల్ అయ్యేది. కానీ.. ఇప్పుడు అలా కాదు. ఈ ఆటో అప్‌గ్రేడేషన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎంచుకున్న కోచ్‌లో బెర్త్ దొరక్కపోతే.. వారికి అంతకంటే పై కోచ్‌లో సీట్ లభిస్తుంది. అయితే.. ఇది జరగాలంటే.. రైలు టికెట్ బుక్ చేసుకునే ముందే.. మీరు ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీనికి ఎలాంటి ఎక్ట్స్రా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..!
ఉదాహరణకు ఈ ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ద్వారా ఓ ప్యాసింజర్.. స్లీపర్ క్లాసులో టికెట్లు బుక్ చేసుకున్నాడనుకోండి. ఆ బోగీలో అతడికి బెర్త్ ఖాళీ లేకపోతే.. థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న బెర్త్ లభించే ఛాన్స్ ఉంది. అయితే ఇది ఒక్క స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు మాత్రమే కాదు.. ఈ ఆప్షన్ ద్వారా థర్డ్ ఏసీ వారికి.. సెకండ్ ఏసీ, సెకండ్ AC వారికి.. ఫస్ట్ AC వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ సౌకర్యం కేవలం ఆ పై బోగిల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లభిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా.. ఇప్పటి వరకూ.. చాలా మంది స్లీపర్ క్లాస్ రైలు టికెట్లతో.. థర్డ్ ఏసీలో ప్రయాణించారు! ఇది కేవలం ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కౌంటర్లలో బుక్ చేసుకునేవారికి ఈ ఫీచర్ పనిచేయదు.