తెలంగాణ

telangana

ETV Bharat / business

How To Transfer Vehicle Ownership : పాత వాహనం కొంటున్నారా?.. సింపుల్​గా ఓనర్​షిప్​ను ట్రాన్స్​ఫర్​ చేసుకోండిలా!

How To Transfer Vehicle Ownership : మీరు సెకండ్​ హ్యాండ్ వాహనం కొన్నారా? మరి దాని ఓనర్​షిప్​ను మీ పేరు మీదుగా మార్చుకోవాలా? అయితే ఇది మీ కోసమే. ఆన్​లైన్​లో చాలా సులువుగా వాహన యాజమాన్య హక్కులను ఎలా బదిలీ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Transfer Vehicle Ownership Online
How To Transfer Vehicle Ownership

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 10:19 AM IST

How To Transfer Vehicle Ownership :మనలో చాలా మందికి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఉంటుంది. కానీ కొత్త వాహనం కొనేంత సొమ్ము మన వద్ద లేకపోవచ్చు. అటువంటి సమయాల్లో మన చేతిలో ఉన్న ఏకైక ఆప్షన్.. ఎవరైనా సెకండ్ హ్యాండ్​ వాహనాన్ని అమ్మితే దానిని కొనడం. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆ వాహనం వేరొకరి పేరు మీదుగా ఉంటుంది. అందుకే దానిని మన పేరు మీద మార్చడం చాలా అవసరం. అందుకే వెహికల్ ఓనర్​షిప్​ (యాజమాన్యం) బదిలీ ఏవిధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Transfer Vehicle Ownership Online :
మన దేశంలో సెకండ్​ హ్యాండ్ వాహనాలకు.. వాహన యాజమాన్య హక్కుల బదిలీ తప్పనిసరి. దీని తరువాత మాత్రమే మీరు కొనుగోలు చేసిన వాహనంపై అధికారికంగా మీకు హక్కులు కలుగుతాయి. వేరొకరి నుంచి వాహనాన్ని మన పేరు మీదుగా మార్చే ప్రక్రియ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఆన్​లైన్​లో వెహికల్ ఓనర్​షిప్ ట్రాన్స్​ఫర్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కనుక మీరు కొనుగోలు చేసిన సెకండ్​ హ్యండ్ వాహన యాజమాన్య హక్కులను.. ఆన్​లైన్​లోనే మీ పేరు మీద మార్చుకోవచ్చు. దానికి ఏమేం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Second Hand Vehicle Ownership Transfer :

  • ముందుగా https://parivahan.gov.in/ వెబ్​సైట్​ని సందర్శించండి.
  • ఆ వెబ్​సైట్​లో Create Account అనే ఆప్షన్​పై క్లిక్ చేసి.. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత వెబ్​సైట్​లోని Online services అనే ఆప్షన్​ను క్లిక్ చేయండి.
  • అక్కడ మీకు Vehicle Related Services అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • Choose Your State అనే ఆప్షన్​ని క్లిక్​ చేసి.. మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • Enter Vehicle Details ఆప్షన్​ని క్లిక్ చేసి.. వాహనానికి సంబంధించిన వివరాలు నమోదు చేయండి. ( రిజిస్ట్రేషన్ నంబర్, Chasis Number ను ఎంటర్ చేయండి.
  • Applicationలో వాహనానికి సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేయండి.
  • చివరగా Payment ఆప్షన్(T&C) ద్వారా రుసుము చెల్లించండి.

గమనిక : ఓనర్​షిప్ మార్పు కోసం అవసరమైన డాక్యుమెంట్లును ఆన్​లైన్​లోనే సబ్​మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్​తో లింక్ అయివున్న ఫోన్​ నంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు కచ్చితంగా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు డాక్యుమెంట్ సబ్మిషన్​కు ముందు PUC సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

అవసరమైన డాక్యుమెంట్లు ఇవే :

1. Form 28

2. Form 29

3. Form 30

4. Form 31

5. Form 35

6. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

7. బైక్ ఇన్స్​రెన్స్ పాలసీ

8. పొల్యుషన్ సర్టిఫికెట్

9. ప్రభుత్వ గుర్తింపు కార్డు (అడ్రస్ ప్రూఫ్​ కోసం)

వెహికల్ ఓనర్​షిప్​ ట్రాన్స్​ఫర్ అప్లికేషన్ సబ్మిట్​ చేసిన తరువాత.. ట్రాన్సాక్షన్​ రిసిప్ట్​ సహా అప్లికేషన్ ప్రింట్అవుట్​ను తీసుకోవాలి. వాస్తవానికి మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అనే దానిని అనుసరించి.. ఆయా నిబంధనల ప్రకారం వాహన యాజమాన్య బదిలీ జరుగుతుంది. మీ అప్లికేషన్​ను ఆర్​టీఓ అధికారులు పరిశీలించి.. మీకు కొత్త రిజిస్ట్రేషన్ కార్డు అందిస్తారు. దీనితో సదరు బండిపై మీకు సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కలుగుతాయి.

How To Close Savings Bank Account : సేవింగ్స్‌ బ్యాంక్​ అకౌంట్​ క్లోజ్‌ చేయాలా..? నెగెటివ్ బ్యాలెన్స్​ ఉంటే..?

Best Scooters Under 1 Lakh : అమ్మాయిలకు సూట్​ అయ్యే బెస్ట్​ స్కూటీస్​ ఇవే.. ధర రూ.1 లక్షలోపే.. ఫీచర్స్​ అదుర్స్​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details