How To Start A Gas Agency :చాలా మంది బిజినెస్ చేయాలని చూస్తుంటారు. కానీ.. ఏ రంగంలోకి వెళ్లాలనే విషయంలో క్లారిటీ ఉండదు. కానీ.. కొంతమంది మాత్రం ఎప్పుడూ డిమాండ్ తగ్గని బిజినెస్‌లను ఎంచుకొని.. చక్కటి ఆదాయం సంపాదిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఒకటే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. మరి మరీ కూడా వంట గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ గా మారాలని అనుకుంటున్నారా? ఎలా దరఖాస్తు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
How To Became A Gas Agency Agent : గ్యాస్ ఏజెన్సీని ఎలా ప్రారంభించాలి?
ఒక గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఇందుకోసం మీరు వంట గ్యాస్ కంపెనీలు విధించే షరతులను అంగీకరించాలి. దాని ప్రకారం మందుగా లైసెన్స్ పొందాలి. ఈ గ్యాస్ ఏజెన్సీ లైసెన్స్ మంజూరు కోసం కంపెనీలు ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరిస్తుంటాయి.
గ్యాస్ ఏజెన్సీ దరఖాస్తు విధానం..
HP గ్యాస్ ఏజెన్సీ దరఖాస్తు విధానాన్ని హిందుస్థాన్ పెట్రోలియం వెబ్‌సైట్ ఆధారంగా తెలుసుకుందాం. గ్యాస్ ఏజెన్సీ కోసం మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. తరవాత ఎంపికైన వ్యక్తులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హజరు కావాలని సూచిస్తారు. ఇందులో నిబంధనల ప్రకారం కొంతమందిని ఎంపిక చేస్తారు. ఇంటర్యూలో షార్ట్‌లిస్ట్ అయిన వ్యక్తుల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఎంపికైన తరవాత మిమ్మల్ని కొన్ని పత్రాలను సమర్పించమని కోరతారు. అవి అందించాలి.
How To Start Gas Agency Distribution : స్థలం పరిశీలన..
గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్‌గా ఎంపికైన తరవాత, మీరు ఎక్కడైతే ఏజెన్సీని ఏర్పాటు చేస్తారో ఆ స్థలాన్ని, సిలిండర్‌లను నిల్వ చేసే గోడౌన్‌లను గ్యాస్ కంపెనీ అధికారులు వచ్చి పరిశీలిస్తారు. ఒకవేళ మీకు సొంత స్థలం లేకపోతే, మీరు ఎంపిక చేసుకున్న స్థలాన్ని 15 ఏళ్ల వరకు తప్పక లీజుకు తీసుకోవాలి.