How To Shift From Group Policy To Single Policy : ఆరోగ్య బీమా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అవసమైన బీమా పథకాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని బృంద ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తుంటాయి. అయితే ఈ రకమైన పాలసీలు సదరు ఉద్యోగి ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం వరకే వర్తిస్తాయి. ఆ తర్వాత రద్దవుతాయి.
ఒకవేళ ఉద్యోగం మారాల్సి వచ్చినా, పదవీ విరమణ చేసినా, కంపెనీయే ఈ సౌలభ్యాన్ని ఆపేసినా మీకు మీ కుటుంబానికి ఆరోగ్య భద్రత దూరమైనట్లే. అలాంటి సందర్భాల్లోనే మీరు తీసుకునే ఓ నిర్ణయం మీకు, మీ కుటుంబానికి ఉన్న ఆరోగ్య భద్రత కొనసాగేలా చేస్తుంది. అదే గ్రూప్ హెల్త్ పాలసీ నుంచి ఇండివిజువల్ పాలసీలోకి( Apply Group Policy To Single User ) మారడం. అవును ఇలా మరేందుకు అవకాశం కల్పిస్తున్నాయి బీమా కంపెనీలు. మరి ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు చూద్దాం.
బృంద ఆరోగ్య పాలసీ అంటే ఏమిటి?
What Is Group Health Policy :బృంద బీమా పాలసీ లేదా గ్రూప్ పాలసీ మీతోపాటు మీ కుటుంబానికి ఆరోగ్య భద్రతను కల్పిస్తాయి. ఇలాంటి సమయాల్లో దీనిని ఫ్యామిలీ ఫ్లోటర్‌గా కూడా మార్చుకోవచ్చు. ఒక్కరికే వర్తిస్తే గనుక.. వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్లాన్‌కు మారవచ్చు. బృంద ఆరోగ్య బీమా నుంచి వ్యక్తిగత పాలసీగా మార్చుకోవాలనుకుంటే ముందుగా ఆ విషయాన్ని కంపెనీ యాజమాన్యానికి తెలియజేయాలి. పాలసీ పునరుద్ధరణకు 45 రోజుల ముందే ఈ విషయాన్ని సంబంధిత బీమా సంస్థకు చెప్పాలి. అప్పుడైతేనే పాలసీని సులభంగా పోర్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇండివిజువల్ పాలసీకి మారితే కలిగే లాభాలు!
Benefits Of Group Policy To Individual Policy :గ్రూప్ హెల్త్ పాలసీని ఇండివిజువల్ పాలసీగా మార్చడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సదరు సంస్థలో మీరు ఉద్యోగం మానేసినా, పదవీ విరమణ చేసినా, సంస్థ పాలసీని ఆపేయాలని నిర్ణయించినా ఇలా పలు సందర్భాల్లో మీకు అందే బీమా రక్షణను కోల్పోతారు. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు బృంద పాలసీ నుంచి సొంత పాలసీకి మారడం ఎంతో దోహదం చేస్తుంది.
ఒకవేళ మీరు కొత్త పాలసీ తీసుకోవాలన్నా మళ్లీ 3 నుంచి 4 ఏళ్లపాటు వేచి ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో మీ సమయం వృథా అవుతుంది. కాగా, ఇప్పటికే మీరు బృంద పాలసీలో కొన్నాళ్లు ఉండి బయటకు వస్తారు కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ కలిసొస్తుంది. ఉదాహరణకు ఒక గ్రూప్ పాలసీలో నాలుగేళ్ల పాటు వేచి ఉండే విధంగా టైమ్ లిమిట్ ఉందనుకుందాం. అప్పటికే బృంద పాలసీలో మీరు మూడేళ్లు కొనసాగి.. సొంత పాలసీకి మారితే గనుక కేవలం ఏడాది పాటే మీరు వేచి ఉంటారు. ఇలా మీ సొంత పాలసీ కాల వ్యవధి తగ్గుతుంది.