How to Register SBI Mobile Banking Services:గతంలో..మనం డబ్బులు విత్ డ్రా చేయడానికైనా.. డిపాజిట్ చేయడానికైనా బ్యాంకుకు వెళ్లాల్సిందే. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని పన పూర్తి చేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో.. బ్యాంకులకు వెళ్లాలంటే చాలా మందికి విసుగు వచ్చేదంటే అతిశయోక్తి కాదు. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకున్న బ్యాంకులు.. మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ వంటి యాప్‌లు రావడంతో.. జనాలకు బ్యాంకులకు వెళ్లేపని మరింతగా తగ్గిపోయింది.
అయితే.. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్లు, ఇతర వివరాల కోసం.. మొబైల్ బ్యాంకింగ్‌ను వాడాల్సిందే. కానీ.. వాటి గురించి సామాన్యులకు లోతైన అవగాహన లేదు. దీంతో.. అనివార్యంగా వీరంతా బ్యాంకుల చుట్టూనే తిరగాల్సి వస్తోంది. ఇలాంటి వారి కోసమే ఎస్‌బీఐ ఈజీ పద్ధతుల్లో మొబైల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవడం కోసం కొన్ని సింపుల్ ప్రాసెస్లు అందుబాటులోకి తెచ్చింది.
State Bank of India Mobile Banking Services: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన వినియోగదారులు ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా లావాదేవీలు జరపడానికి.. సాంకేతికతకు అనుగుణంగా తనను తాను మార్చుకుంది. నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో పాటు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. యాప్స్ రాజ్యమేలుతున్న ఈ ఆధునిక యుగంలో.. తన యూజర్స్ కోసం పలు యాప్స్ తీసుకొచ్చింది. వీటిలో.. SBI YONO, BHIM SBI PAY, SBI బడ్డీ వంటి కొన్ని మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
How Many Steps to Register SBI Mobile Banking Services:ఇందులో.. SBI మొబైల్ బ్యాంకింగ్ కు సేవలను సరళతరం చేసేదే YONO యాప్. దీనికి లైట్ వెర్షన్ కూడా తీసుకొచ్చింది. అదే.. YONO Lite. మరి, ఈ యాప్ ను ఎలా వినియోగించుకోవాలి? ఇందుకోసం నాలుగు పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.