How to Set up UPI PIN Using Aadhaar Card? : నేటి ఆధునిక కాలంలో.. చాలా వరకు చెల్లింపున్నీ యూపీఐ యాప్స్ ద్వారానే జరిగిపోతున్నాయి. అయితే.. యూపీఐ యాప్స్ ఫోన్ పే(PhonePe), గూగుల్ పే(Google Pay), భీమ్ వంటి యూపీఐ యాప్స్.. యాక్టివేషన్ కోసం మాత్రం డెబిట్‌కార్డు అవసరం తప్పనిసరి. కానీ.. ఇకపై డెబిట్ కార్డు లేకుండానే యాపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆధార్‌తో ఎలా యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Setup UPI Pin with Aadhaar :డెబిట్‌కార్డుతో యూపీఐ యాక్టివేషన్ ప్రక్రియతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతుండడంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. చాలా మందికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. వారికి డెబిట్ కార్డు లేకపోవడంతో యూపీఐ యాప్స్ వాడడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో.. డెబిట్ కార్డు అవసరం లేకుండా ఆధార్ నంబర్‌తో ఈజీగా మీ యూపీఐ పిన్ నంబర్ సెట్ చేసుకోవచ్చు. అయితే.. ఇందుకు ఆధార్(Aadhaar)తో లింక్ చేసిన మొబైల్ నంబర్.. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్ ఒకటే అయి ఉండాలి. ఇప్పుడు మీరు యూపీఐకి యాడ్ చేయాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్.. మీ ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి.
How To Reverse UPI Transaction : యూపీఐ ద్వారా రాంగ్ నంబర్‌కు పేమెంట్ చేశారా?.. వెనక్కు తీసుకోండిలా!
How to Set up UPI PIN with Aadhaar Number in Telugu :
మీ ఆధార్ నంబర్‌తోయూపీఐ పిన్ సెట్ చేసుకోండిలా..
- మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీ బ్యాంక్ అధికారిక యూపీఐ కనుగొని దానిని డౌన్లోడ్ చేసి.. ఇన్స్టాల్ చేసుకోవాలి.
- ఆ తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి 'Register' or 'Sign Up'అనే ఆప్షన్‌పై నొక్కాలి.
- అప్పుడు మీ బ్యాంక్‌లో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆపై ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత అవసరమైన సమాచారాన్ని అందించడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్‌ను యూపీఐ యాప్‌నకు కనెక్ట్ చేయాలి.
- అనంతరం యాప్‌లో మీ ఆధారాలతో లాగిన్ అవ్వాలి.
- ఆపై UPI servicesకి నావిగేట్ అయితే.. అక్కడ “UPI,” “Payments,” or “Transactions” అనే ఆప్షన్స్ ఉంటాయి.
- ఆ తర్వాత UPI పిన్‌ని క్రియేట్ చేసుకునే ఆప్షన్‌ను మీరు ఎంచుకోవాలి. అందుకు “Using Aadhaar Card” అనే పద్ధతిని సెలెక్ట్ చేసుకోవాలి.
- అనంతరం మీ ఆధార్ కార్డులోని చివరి ఆరు అంకెలను నమోదు చేయాలి.
- ఇప్పుడు ఆధార్‌తో అనుసంధానించబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- ఓటీపీ అక్కడ నమోదు చేయాలి. అనంతరం 4-6 అంకెల UPI పిన్‌ని సెట్ చేసుకోవాలి. దానిని నిర్ధారించడానికి మళ్లీ UPI పిన్‌ని మళ్లీ నమోదు చేయాలి.
- మీరు UPI పిన్ నమోదు చేసిన తర్వాత.. మీ సెటప్ కన్ఫార్మ్ అవుతుంది.
- అంతే.. UPIతో సురక్షితమైన లావాదేవీలను ప్రారంభించవచ్చు.
How To Resolve Failed UPI Payments : యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యిందా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
HDFC and ICICI Banks Starts UPI Now, Pay Later : 'యూపీఐ' వాడే వారికి గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు లేకున్నా చెల్లింపులకు ఓకే..!