How to Set up Payment Reminders in UPI :ఇవాళ ప్రతి ఒక్కరూ టీ తాగిన దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీల జరపడం వరకూ UPI యాప్‌లనే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది అనేక రకాల బిల్లులు చెల్లించడానికీ డిజిటల్ చెల్లింపులనే ఎంచుకుంటున్నారు. అయితే.. నెలనెలా చెల్లించే.. కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, నల్లా బిల్లు నుంచి క్రెడిట్ కార్డు(Credit Card)బిల్లు దాకా.. ఏదో ఒకటి సమయానికి చెల్లించడం మరిచిపోతుంటారు. ఆ తర్వాత ఫైన్ తో చెల్లిస్తుంటారు.
అయితే.. మనం మరిచిపోయినా.. బిల్ తేదీని ఎవరైనా గుర్తు చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా..! ఈ సౌకర్యాన్ని UPI యాప్స్ అందుబాటులోకి తెచ్చాయి. Google Pay, Paytm, Phonepe ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. దీనికి మనం చేయాల్సిందల్లా ఆ యాప్‌లలో చెల్లింపు రిమైండర్లను సెట్ చేసుకోవడం మాత్రమే.. మరి, అది ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Google Payలో చెల్లింపు రిమైండర్‌ను ఎలా సెట్ చేసుకోవాలంటే..?
How to Set up Payment Reminders on Google Pay in Telugu :
- మొదట మీ ఫోన్‌లో GPayని తెరిచి కిందికి స్క్రోల్ చేయాలి.
- అక్కడ 'Regular payments' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో Payment Categoryని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత Contact Page ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు ప్రారంభ తేదీ, చెల్లింపు ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవాలి. అలాగే చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి.
- చివరగా అక్కడ వచ్చే 'Set Reminder' అనే ఆప్షన్‌పై నొక్కాలి.
- అంతే.. మీ చెల్లింపు రిమైండర్ Google Payలో సెట్ అయిపోతుంది.
- ఆ సమయానికి మీకు చెల్లింపు విషయం గుర్తు చేస్తుంది Gpay.
Digital Payments Security : డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
How to Set up Payment Reminder on Paytm :
Paytmలో చెల్లింపు రిమైండర్‌ని సెట్ చేసుకోండిలా..
- Paytm యాప్‌ని ఓపెన్ చేసి.. మీ ప్రొఫైల్ పిక్చర్‌పై నొక్కాలి.
- ఆ తర్వాత మెనూ నుంచి "Payment Settings"పై క్లిక్ చేయాలి.
- అనంతరం కిందికి స్క్రోల్ చేసి.. "Payment Reminder" అనే ఆప్షన్‌పై నొక్కాలి.
- అప్పుడు మీరు సాధారణ చెల్లింపులను పంపాలనుకుంటున్న కాంటాక్ట్ లేదా వ్యాపారాన్ని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఎగువ కుడి వైపున ఉన్న "Add new" ఆప్షన్ పై నొక్కాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో కాంటాక్ట్‌ను సెర్చ్ చేసి ఎంచుకోవాలి. ఆపై Payment type, తేదీని ఎంచుకోవాలి.
- చివరగా 'Set Payment Reminder'పై నొక్కితే మీ చెల్లింపు రిమైండర్ పేటీఎంలో సెట్ చేయబడుతుంది.
UPI Money Sent To Wrong Recipient? What next? : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బు పంపిస్తే.. ఏం చేయాలి?
How to Set up Payment Reminder on Phonepe :
Phonepeలో చెల్లింపు రిమైండర్‌ని సెట్ చేయడం ఎలాగంటే..
- మొదట మీరు Phonepe యాప్‌ని ఓపెన్ చేసి మనీ ట్రాన్స్‌ఫర్ కింద 'To Mobile Number' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న ఇటీవలి చెల్లింపుల్లో.. మీరు రిమైండర్ సెట్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ ను ఎంచుకోవాలి
- లేదంటే ఆ సంస్థ లేదా.. వ్యక్తి కాంటాక్ట్ కోసం సెర్చ్ చేయాలి.
- అనంతరం మీకు కావాల్సిన చెల్లింపు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది.
- కుడివైపున ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై నొక్కాలి.
- అప్పుడు పాప్-అప్ మెనూ నుంచి "Manage Reminders" ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఓపెన్ పేజీలో Add Reminder అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేసి, చెల్లింపు ఫ్రీక్వెన్సీని ఎంచుకోవాలి. అలాగే ప్రారంభ తేదీని సెట్ చేయాలి.
- ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరగా చెల్లింపు రిమైండర్‌ను సెట్ చేయడానికి Save అనే ఆప్షన్‌పై నొక్కితే మీ రిమైండర్ సెట్ అవుతుంది.
డెబిట్ కార్డ్ లేకపోయినా UPI యాక్టివేషన్.. ప్రాసెస్ ఇలా..
ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్ బిల్ షేర్ చేసుకోవాలా..? గూగుల్ పేలోని ఈ ఫీచర్‌తో ఈజీగా కట్టొచ్చు