How To Reverse UPI Transaction :భారత్‌లో యూపీఐ పేమెంట్ లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. డబ్బులు చెల్లించేందుకు కోట్ల మంది ఈ పద్ధతినే వాడుతున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లోనే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో పంపాల్సిన వారికి కాకుండా వేరే వారికి డబ్బులు పంపిస్తుంటాం. రాంగ్ యూపీఐ ఐడీ లేదా రాంగ్ ఫోన్ నంబర్లకు డబ్బులు పంపించేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో ఏం చేయాలి? తిరిగి డబ్బును ఎలా వెనక్కు తెచ్చుకోవాలి? ఈ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఈ క్రింది సందర్భాలలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
- అనుకోకుండా వేరే వారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపించినప్పుడు
- అనధికార చెల్లింపులు జరిపినప్పుడు
- మోసపూరితమైన లావాదేవీలు జరిగినప్పుడు
- అవతలి వ్యక్తి ఇంకా చెల్లింపులను స్వీకరించనప్పుడు
- పేమెంట్ చేసే సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తినప్పుడు
చెల్లింపుల సమయంలో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు.. ముందుగా సంబంధిత బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. అక్కడి అధికారుల దృష్టికి మీ సమస్యను తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని లావాదేవీలను తిరిగి రివర్స్ చేయడానికి వీలుపడదు. ఒకవేళ గ్రహీత మీ పేమెంట్‌ను రిసీవ్ చేసుకున్నట్లయితే అది కాస్త కష్టంగా మారవచ్చు. కేవలం మీ బ్యాంక్‌ను మాత్రమే కాకుండా.. యూపీఐసర్వీస్ ప్రొవైడర్‌ను కూడా కలిసి మీ సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.
UPI Vs UPI Lite : బేసిక్ ఫోన్‌తో పేమెంట్స్ చేయాలా?.. UPI & యూపీఐ లైట్ వాడండిలా!