How To Reduce Home Loan EMI : సొంత ఇళ్లు కట్టుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ, అంత పెద్ద మొత్తంలో డబ్బు అందరి దగ్గరా ఉండదు. అందుకే.. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి హోమ్లోన్స్ తీసుకుంటారు. అయితే.. 10, 15, 20 అంటూ సంవత్సరాల తరబడి ఈఎంఐలు చెల్లిస్తూ పోతుంటే.. మొత్తం అప్పు ఎప్పుడు తీరిపోతుందా? అని మదన పడుతుంటారు. అయితే.. టెన్యూర్ కంటే ముందే లోన్ తీర్చడానికి.. 8 ఉత్తమమైన మార్గాలు సూచిస్తున్నారు నిపుణులు. వాటిగురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అంతటా ఆరా తీయాలి..
మీరు హోమ్‌లోన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు.. మార్కెట్లోని అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను ఆరా తీయాలి. ఎంత శాతం వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయో ఎంక్వైరీ చేయండి. ఫ్రీ ఆన్లైన్ టూల్స్‌ను ఉపయోగించి ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువగా ఉంది, ఈఎంఐ ఎక్కడ తక్కువ పడుతుంది అనే వివరాలను ఆరా తీసి మీకు అనువైన రుణగ్రహీతను ఎంపిక చేసుకోండి.
ఈఎంఐ ఎంపిక..
మీరు హోమ్‌లోన్ టెన్యూర్‌ను ఎక్కువ కాలం సెలెక్ట్ చేసుకుంటే.. ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ భారం తక్కువగా ఉంటుంది. కానీ.. హోమ్‌లోన్ టెన్యూర్ ఎక్కువ కాలం ఉంటే.. ఓవరాల్‌గా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అందువల్ల మీ ఆదాయాన్ని బట్టి.. కాస్త భారమైనా ఈఎంఐ ఎక్కువ చెల్లించేలా చూసుకోండి. చేతిలో డబ్బు ఎంత ఉన్నా తెలియకుండా ఖర్చు అయిపోతుందని మరిచిపోకండి.
హోమ్ లోన్స్‌పై ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ- పైగా బోలెడన్ని బెనిఫిట్స్!
మంచి క్రెడిట్ స్కోరు..
ఏ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా సరే.. బ్యాంకులు ముందుగా కస్టమర్ల సిబిల్ స్కోర్ చూస్తాయి. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తుంటాయి. కాబట్టి, కస్టమర్లు మంచి క్రెడిట్ స్కోర్మెయింటేన్ చేయండి. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇతర పేమెంట్లు ఏవైనా.. గడువు తేదీ కంటే ముందే చెల్లించండి. ఇలా చేయడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తుంటాయి.
అధికారులతో మాట్లాడండి..
మీకు గృహ రుణం ఇచ్చే బ్యాంకుతో వడ్డీ రేటు విషయంపై భేరసారాలు జరపొచ్చు. మీ ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలూ బ్యాంకు అధికారులతో చెప్పి, తక్కువ వడ్డీకే లోను వచ్చేలా చూడమని విజ్ఞప్తి చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది.