How To Reduce Credit Card Debt :చేతిలో డబ్బు లేకుండా ఏదైనా వస్తువు కొనాలంటే చాలా మందికి క్రెడిట్ కార్డే ఆప్షన్. ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం, మార్చి 2023 చివరి నాటికి క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ గత సంవత్సరంతో పోలిస్తే రూ. 4,072 కోట్లకు (1.94 శాతానికి) పెరిగింది. అయితేక్రెడిట్ కార్డ్బకాయిలు సైతం పెరిగాయి. 2022 మార్చిలో ఇవి రూ. 1.64 లక్షల కోట్ల నుంచి.. 2023 మార్చిలో రూ. 2.10 లక్షల కోట్లకు పెరిగాయి. ఎలాగూ కార్డు ఉంది కదా, లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉందని.. ఇష్టానుసారంగా వాడితే చిక్కుల్లో పడతారు. క్రెడిట్ కార్డుపై ఎక్కువ రుణం తీసుకుని.. ఆ సమస్య నుంచి బయటపడటానికి ఒక పద్ధతి ఉంది. అదే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ పద్ధతి.
ఇంతకీ ఎంటీ ఈ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ పద్ధతి?
What Is Credit Card Balance Transfer :క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ రుణాన్ని వడ్డీ రేటు తక్కువగా ఉన్న మరొక క్రెడిట్ కార్డ్‌కు బదిలీ చేయడం. బ్యాలెన్స్ బదిలీలు ఒకే బ్యాంకులో కాకుండా వివిధ బ్యాంకుల మధ్య కూడా చేయవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ రుణ భారాన్ని తగ్గించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బకాయి ఉన్న కార్డ్ రుణంపై వడ్డీ రేట్లు 42 శాతానికి పెరుగుతాయి.
అయితే.. బ్యాలెన్స్‌ను బదిలీ చేసే సౌలభ్యం అన్ని బ్యాంకుల్లో లేదు. ఫెడరల్ బ్యాంక్, HSBC, PNB, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్ మొదలైనవి ఈ ఆఫర్‌ను అందిస్తున్నాయి. బ్యాంకులు ఇప్పుడు బ్యాలెన్స్ బదిలీలో వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తున్నాయి. మీకు బాగా సరిపోయే ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. సున్నా వడ్డీతో 30- 45 రోజులలోపు చెల్లించే ప్లాన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లపై EMIని అందజేస్తున్నాయి. పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాన్ని కొంత వ్యవధిలో తీర్చడానికి అనుమతిస్తాయి.