How to Recharge FASTag With Google Pay:రహదారులపైప్రయాణీకులు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.. హైవేల మీదున్న టోల్ ప్లాజాలను దాటడం. ఇక్కడ ఉండే పొడవైన క్యూను దాటేందుకు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక, పండగ సమయాల్లోనైతే.. చెప్పాల్సిన పనిలేదు. గంటలకొద్దీ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. దీనివల్ల చాలా సమయం అక్కడే వృథా అవుతుంది. అయితే.. ఇలా టైమ్ వేస్ట్ కాకుండా.. కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్నిప్రవేశపెట్టింది. దీనిని డిసెంబర్ 2019 నుంచి నాలుగు చక్రాలు, ఆపై ఉన్న వాహనాలకు తప్పనిసరి చేసింది. దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను ఫాస్టాగ్‌తో అనుసంధానం చేశారు.
ఫాస్టాగ్ అంటే ఏమిటి?:
What is FASTag:నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సహాయంతో భారత ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్‌ను (NETC) సూచించే ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమం ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా టోల్ టాక్స్ వసూలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్‌నే ఫాస్టాగ్ అని పిలుస్తారు. ఇది టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(RFID) టెక్నాలజీని ఉపయోగించే పరికరం.
వాహనం.. టోల్ ప్లాజా ఫాస్టాగ్ లైన్లో వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీలను కట్ చేస్తుంది. ఫోర్ వీలర్స్ ముందు విండో స్క్రీన్‌పై ఫాస్టాగ్ స్టిక్కర్ అతికిస్తారు. ఈ స్టిక్కర్ అతికించి ఉన్న వాహనాలు.. టోల్‌ను దాటినప్పుడు వాహనంతో లింక్ చేసిన ఫాస్టాగ్ ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.