How to Nominee Withdraw Deceased Employee PF Money : ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే అందరికీ పీఎఫ్ గురించి తెలిసే ఉంటుంది. సదరు ఉద్యోగి పనిచేసే కంపెనీ చెల్లించే వేతనంలో వారి నిబంధనలకు అనుగుణంగా కొంత శాతం పీఎఫ్ రూపంలో చెల్లిస్తుంది. దీనికి అదనంగా కంపెనీ కూడా అంతే మొత్తంలో అమౌంట్‌ను యాడ్ చేస్తుంది. ఈ పీఎఫ్‌ను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చెల్లిస్తోంది. అలాగే ఈపీఎఫ్ఓ తమ చందాదారుల కోసం ప్రావిడెంట్ ఫండ్‌తో పాటు పెన్షన్ ఫండ్(EPS), ఎంప్లాయిస్ డిపాజిట్ లింకెడ్ ఇన్సూరెన్స్(ఈడీఎల్ఐ) కింద బీమా వంటి ప్రయోజనాలను అందిస్తోంది.
Procedure PF withdrawal by Nominees : సాధారణంగా ఉద్యోగులు వీటిలో చేరినప్పుడే వారి నామినీని నియమిస్తుంటారు. EPFO సభ్యులు పదవీ విరమణకు ముందు మరణించిన సందర్భంలో వారి PF(Provident Fund) ప్రయోజనాలు(పీఎఫ్ మొత్తం, సంబంధిత వడ్డీ మొత్తం, పెన్షన్) క్లెయిమ్ చేయడానికి సదరు ఉద్యోగి నామినీ/డిపెండెంట్లను దాఖలు చేయడానికి ఈపీఎఫ్ఓ అనుమతిస్తుంది. అయితే.. నామినీ లేదా కుటుంబ సభ్యులు ఆ ప్రయోజనాలు పొందాలంటే మొదట ఈ-నామినేషన్ దాఖలు చేయాలి.
మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ 4 ఈజీ మార్గాలు ట్రై చేయండి!
ఈ-నామినేషన్‌ను ఎలా దాఖలు చేయాలి?
How to Apply E-Nomination in Telugu :ఎవరైతే ఈపీఎఫ్ సభ్యుడు ఉద్యోగ విరమణకు ముందు మరణిస్తారో వారి నామినీ లేదా కుటుంబ సభ్యుడు అయిన హక్కుదారు చనిపోయిన ఈపీఎఫ్ సభ్యుని వివరాలతో ఫారం 20ని ఫిల్ చేసి సమర్పించాలి. అలాగే సభ్యుడు చివరిగా ఉద్యోగం చేసిన కంపెనీ లేదా సంస్థ యజమాని ద్వారా ఈ దరఖాస్తును సమర్పించాలి. అదేవిధంగా ఈ ఫారం 20లో క్లెయిమ్‌దారు ఆధార్-లింక్(Aadhaar Link) చేయబడిన సంప్రదింపు వివరాలను సమగ్రంగా అందించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత హక్కుదారు క్లెయిమ్ ఫారం ఆమోదం గురించిన SMS నోటిఫికేషన్లను స్వీకరిస్తారు. ఆ తర్వాత సభ్యుడు పొందే ప్రయోజనాలకు సంబంధించిన డబ్బు క్లెయిమ్‌దారు బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది.