How to Link LIC Policy With PF Account in Telugu:ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అంతిమ లక్ష్యం ఒక్కటే. ఉద్యోగులు లేదా పాలసీదారులకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించడం! అయితే.. రెండిటి మధ్య చిన్న తేడా ఉంది. పీఎఫ్ ఖాతాకు చేరాల్సిన సొమ్ము ఉద్యోగి చేతి నుంచి చెల్లించకుండానే చేరిపోతుంది. కానీ.. LIC ప్రీమియం మాత్రం పాలసీదారు నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి చేతిలో డబ్బులేక చెల్లించలేకపోతుంటారు. ఇలాంటి వారికి PF, ఎల్‌ఐసీ కలిసి ఓ అద్భుత అవకాశాన్ని అందిస్తున్నాయి. మరి.. అదేంటి అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
EPF Advance For Marriage : పెళ్లి కోసం డబ్బులు కావాలా?.. ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందండిలా!
పీఎఫ్ ఖాతాతో ఎల్‌ఐసీ పాలసీ లింక్ వల్ల ప్రయోజనాలు:
Benefits of Linking LIC Policy with PF Account:ఆర్థిక సమస్యలు వేధిస్తున్న పాలసీదారులు.. గడువు తేదీలోపు ప్రీమియం చెల్లించలేకపోతుంటారు. దీనివల్ల ఫైన్ చెల్లించాల్సి రావొచ్చు. నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగి.. పాలసీని కొనసాగించలేకపోవచ్చు కూడా. అందుకే.. పీఎఫ్, ఎల్‌ఐసీ సంస్థలు కలిసి.. PF అకౌంట్ కలిగిన ఉద్యోగులకు ఓ సూపర్ ఛాన్స్ అందిస్తున్నాయి. PF అకౌంట్‌తో.. LIC పాలసీని లింక్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. అంటే.. ఇక నుంచి మీరు మీ PF డబ్బు ఉపయోగించి LIC పాలసీ ప్రీమియం చెల్లించవచ్చన్నమాట!
ఉద్యోగులకు మేలే..!