How to Link Aadhaar with UAN in Online Process :ఈపీఎఫ్ (EPF) ఖాతాదారులకు యూఏఎన్ నంబరు (Universal Account Number) చాలా కీలకమైనది. ఇది ఈపీఎఫ్‌వో(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) తమ సభ్యులకు కేటాయించే 12 అంకెల సంఖ్య. దీని ద్వారా సభ్యులు ఆన్లైన్లో ఈపీఎఫ్ ఖాతాకు సులభంగా లాగిన్ అయ్యి.. పీఎఫ్ బ్యాలెన్స్(PF Balance)ను తెలుసుకోవచ్చు. యూఏఎన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగానే ఆన్లైన్ ద్వారానే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్న మీ యూఏఎన్(UAN)ను ఆధార్ నంబర్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలి.
Aadhaar link with UAN Online Process : ఆధార్ నంబర్(Aadhaar Number)తో మీ యూఏఎన్ లింక్ చేయకపోతే .. మీ నెలవారీ కాంట్రిబ్యూషన్.. మీ అకౌంట్లో మీ యజమాని డిపాజిట్ చేయలేరు. అలాగే.. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. బీమా ప్రయోజనాలు సైతం అందవు. అందువల్ల మీ ఆధార్‌ను ఇప్పటికే లింక్ చేయకపోతే లింక్ చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)గతంలోనే సూచించింది. అయితే.. ఇప్పటికీ చేసుకోని వారికి.. ఈపీఎఫ్‌వో మరో అవకాశం ఇచ్చింది. మార్చి 31, 2024 వరకు ఈ గడువు పొడిగించింది. మరి, వెంటనే లింక్ చేయండి. కింద పేర్కొన విధంగా.. మీరు సులువుగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.