తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Increase Jio Internet Speed : జియో సిమ్ వాడుతున్నారా? ఇలా సింపుల్​గా మీ నెట్ స్పీడ్ పెంచుకోండి.! - ఈ ట్రిక్స్ ద్వారా జియో నెట్ స్పీడ్ పెంచుకోండి

How to Increase Jio Net Speed in Telugu : మీరు జియో సిమ్ వాడుతున్నారా? ఒక్కోసారి నెట్​వర్స్ ఇష్యూ వల్ల డేటాను వేగంగా పొందలేకపోతున్నారా? ఇకపై అలాంటి సందర్భాల్లోనూ మీరు ఈ ట్రిక్స్ ఫాలో అవ్వడం ద్వారా వేగవంతమైన ఇంటర్​నెట్​ను పొందవచ్చు. ఇంతకీ ఏంటీ ఆ ట్రిక్స్? వాటిని మొబైల్​లో ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Jio Internet
Jio

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 1:53 PM IST

How to Increase Jio Net Speed in Android Phones :టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఓ పెను సంచలనంగా దూసుకొచ్చిన విషయం మనందరికి తెలిసిందే. మొదట్లో ఎన్నడూ లేని విధంగా తక్కువ ధరలో వేగమైన ఇంటర్నెట్ అందించి యూజర్లను ఆకర్షించింది. నేడు దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన మొబైల్ నెట్​వర్క్​లలో ఒకటిగా మారింది. అలాగే ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్‌ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా డేటా విషయంలో రిలయన్స్ జియో(Reliance Jio) నయా రీఛార్జ్‌ ఆప్షన్స్‌తో ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఇటీవల 5G, Jio Airfiber టెక్నాలజీతో తన సేవలను మరింత విస్తరిస్తోంది.

How to Increase Jio 4G Data Speed : అయితే మరోవైపు కొన్నిప్రాంతాల్లో చాలామందిజియో నెట్​వర్క్ డేటా(Jio Data Speed) స్పీడ్ సరిగ్గా లేదంటూ ఫిర్యాదు చేస్తున్నారు. మీరు జియో సిమ్ వాడుతూ అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? అత్యవసర సమయాల్లో ఇంటర్​నెట్ స్పీడ్ దారుణంగా పడిపోతుందా? ఇకపై అలాంటి సమస్యలను ఎదురైనప్పుడు ఈ ట్రిక్స్ ఫాలో అయ్యి మీ జియో 4G డేటా స్పీడ్ అమాంతం పెంచుకోండి. ఇంతకీ ఏంటీ ఆ ట్రిక్స్? వాటిని ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

  • మొదట మీరు మీ Windows స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి. ఆ తర్వాత 'మొబైల్ + GSM' ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఆపై డేటా రోమింగ్ ఆప్షన్‌లో 'డోన్ట్ రోమ్' ఎంచుకోండి. అలాగే కనెక్షన్ వేగాన్ని ‘4G’కి సెట్ చేయండి.
  • ఆ తర్వాత వెనక్కి వచ్చి 'యాక్సెస్ పాయింట్' ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు 'Add Icon'పై నొక్కండి.
  • అనంతరం కనెక్షన్ పేరుని Jio అని సెట్ చేయండి. ఆపై APNని – jionetకి సెట్ చేయండి.
  • ఇక చివరగా ఈ సెట్టింగ్‌ని యాక్టివేట్ చేయడానికి OKపై నొక్కండి. అంతే మీ డేటా స్పీడ్ పెరుగుతుంది.

ఇది అందరూ చేసే సాధారణ ప్రక్రియ. ఇలా చేసిన మీ డేటా స్పీడ్ పెరగకపోతే ఇప్పుడు మేము చెప్పే ట్రిక్స్ ఓసారి ట్రై చేయండి. ఆ తర్వాత అద్భుతమైన ఫలితాలు పొందండి.

JIO Bharat Amazon : 'జియో భారత్​' సేల్స్​ ప్రారంభం.. రూ.999కే అమేజింగ్ ఫీచర్స్​తో 4జీ ఫోన్​!

JIO 4G వేగాన్ని పెంచే కొన్ని ఉత్తమ పద్ధతులు ఇవే..

How to Increase Jio Net Speed through Changed APN Settings :

APN సెట్టింగ్‌ని మార్చడం ద్వారా JIO డేటా స్పీడ్ ఎలా పెంచుకోవాలి..

  • మొదట మీరు మొబైల్​లో సెట్టింగ్ ఎంపికకు వెళ్లాలి. SIM కార్డ్‌లు, మొబైల్ నెట్‌వర్క్‌ల కోసం సెర్చ్​ చేయాలి.
  • అప్పుడు JIOను సెలెక్ట్ చేసుకొని దానిపై నొక్కాలి.
  • ఇప్పుడు ఇంటర్‌ఫేస్‌లో 3వ స్థానంలో ఉన్న యాక్సెస్ పాయింట్ నేమ్స్(APN) పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత స్క్రీన్ దిగువన ఉన్న +ఐకాన్ దగ్గరకు వెళ్లాలి.
  • ఆపై మీ JIO డేటా వేగాన్ని పెంచడానికి క్రింద పేర్కొన్న విధంగా APN సెట్టింగ్‌ని యాడ్ చేసుకోవాలి.
  • పేరు-JIOLTE900
  • APN- JioNet
  • PROXY-Not set
  • PORT-Not set
  • యూజర్ నేమ్-Jio4G
  • పాస్‌వర్డ్-Not set
  • సర్వర్-www.google.com
  • MMSC- Not set
  • MMSC PROXY- Not set
  • *MCC-Dont change
  • *MNC -మార్చవద్దు (*ఇవి రెండూ ఏరియా కోడ్‌లు కాబట్టి సంఖ్యలను మార్చవద్దు)
  • AUTHENTICATION TYPE - PAP
  • APN రకం-సెట్ చేయబడలేదు
  • ఏపిఎన్ ప్రోటోకాల్-IPv4/IPv6
  • APN రోమింగ్ ప్రోటోకాల్-IPv4/IPv6
  • బేరర్ - EVDO_0 మినహా అన్ని ఎంపికలను టిక్ చేయండి (మీ ఫోన్ ఒకటి కంటే ఎక్కువ ఎంపికలకు మద్దతు ఇవ్వకపోతే ఒకే LTEని టిక్ చేయండి)
  • MVNO రకం - సెట్ చేయబడలేదు.
  • ఇలా మీ APN సెట్టింగ్‌లను మార్చిన తర్వాత ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయండి. అంతే మీ జియో డేటా స్పీడ్ పెరుగుతుంది.

'వారంతా కచ్చితంగా JIO సిమ్​ వాడాల్సిందే'.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

LTE బ్యాండ్‌ని మార్చడం ద్వారా JIO వేగాన్ని పెంచుకోవడం ఎలా..

MediaTek ప్రాసెసర్ ఫోన్‌లలో Jio 4G వేగాన్ని ఇలా పెంచండి..

  • మొదట మీరు ప్లే స్టోర్ నుంచి MTK ఇంజనీరింగ్ మోడ్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఆ దానిని ఓపెన్ చేయాలి.
  • ఆపై 'MTK సెట్టింగ్‌లు' ఎంచుకోవాలి. ఆ తర్వాత తదుపరి విండోలో 'బ్యాండ్‌మోడ్' ఎంచుకోవాలి.
  • అనంతరం Jio SIM వేసిన SIM స్లాట్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 'LTE మోడ్' ఎంచుకోవాలి.
  • అప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి హై స్పీడ్ కోసం బ్యాండ్ 40ని లేదా ఉత్తమ కవరేజ్ కోసం బ్యాండ్ 5ని సెలెక్ట్ చేసుకోవాలి.

Qualcomm ప్రాసెసర్ ఫోన్‌లలో Jio 4G స్పీడ్‌ని ఇలా పెంచుకోండి..

  • Play స్టోర్ నుంచి షార్ట్‌కట్ మాస్టర్ (లైట్) అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
  • ఆపై అనువర్తనాన్ని తెరిచి, ఎగువ కుడి మూలలో కనిపిస్తున్న మెనూకి వెళ్లాలి. ఆ తర్వాత సెర్చ్​పై నొక్కండి.
  • అప్పుడు ఆ బాక్స్​లో “సర్వీస్ మెనూ” లేదా “ఇంజనీరింగ్ మోడ్” అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
  • కనుగొనబడితే ఓపెన్ చేయండి. అలాగే LTE బ్యాండ్‌లను మార్చడానికి యాక్సెస్ చేయండి.

Note : స్టాక్ ROM తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలి. ఎందుకంటే యాక్సెస్ పొందడానికి మీ ఫోన్ తప్పనిసరిగా రూట్ చేయబడి ఉండాలి.

అదేవిధంగా మీ JIO నెట్ స్పీడ్‌ని పెంచే కొన్ని యాప్​లు ఉన్నాయి. అవి మీ ఫోన్ DNS రికార్డ్‌లను ఆప్టిమైజ్ చేయడం ద్వారా JIO నెట్ స్పీడ్‌ని పెంచుతాయి. మీ స్థానానికి అనుగుణంగా వేగవంతమైన సర్వర్‌ని ఎంచుకుని, మీ బ్రౌజింగ్ అనుభవాన్ని వేగవంతం చేయడంలో సహాయపడతాయి. అవి మీ డౌన్‌లోడ్/అప్‌లోడ్ వేగాన్ని పెంచనప్పటికీ.. కొన్ని సందర్భాల్లో అవి వెబ్ బ్రౌజింగ్ సమయంలో గణనీయమైన మెరుగుదలలకు దారితీయవచ్చు. అవేంటో ఇప్పుడు చూడండి.

  • DNS ఛేంజర్
  • ఇంటర్నెట్ ఆప్టిమైజర్ ప్రో
  • IPv4/IPv6 కోసం DNSChanger
  • నెట్ ఆప్టిమైజర్
  • ఓపెన్ సిగ్నల్ - 5G, 4G, 3G ఇంటర్నెట్ & వైఫై స్పీడ్ టెస్ట్
  • ఈ యాప్‌లను ఉపయోగించడానికి మీరు మీ ఫోన్‌ని రూట్ చేయాల్సిన అవసరం లేదు.

Reliance Jio Special Offers : జియో ప్రీపెయిడ్​ ప్లాన్స్​పై స్పెషల్ ఆఫర్స్​.. మరికొద్ది రోజులే ఛాన్స్​!

మీ వస్తువులను ఎక్కడైనా మర్చిపోయారా?.. వెతికిపెట్టేందుకు 'JIO TAG'​ ఉందిగా!

ABOUT THE AUTHOR

...view details