How to Increase Car Brake System Life : వాహనాలకు బ్రేక్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేడా వస్తే యాక్సిడెంట్లు అయిపోతాయి! ఇంత ముఖ్యమైన బ్రేకులు.. కొన్ని కార్లలో త్వరగా దెబ్బతినిపోతుంటాయి. దీనికి కారణం.. సరిగా మెయింటెయిన్ చేయకపోవడమే అంటున్నారు నిపుణులు! ఈ క్రమంలో పలు సూచనలు కూడా చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగానే స్లో చేయాలి..
అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ కారు ఎక్కడ ఆపాలో మనకు ముందే తెలిసి ఉంటుంది. కాబట్టి.. బ్రేకులు వేయాల్సిన సమయానికి ముందే కారు వేగాన్ని తగ్గించాలి. కొంత మంది బ్రేక్ పాయింట్ దగ్గరికి చాలా వేగంగా వెళ్లి ఒక్కసారి బ్రేక్ వేస్తుంటారు. దీనివల్ల బ్రేక్ ప్యాడ్‌లు చాలా వేడిని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా తరచూ జరగడం వల్ల బ్రేకులు మార్చాల్సి వస్తుంది. అంతేకాదు.. కారు వేగంలో ఉండగా అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నార్మల్ వేగంలో వెళ్లడం అన్ని విదాలా మంచిది.
బ్రేక్ ఫ్లూయిడ్ ఛేంజ్..
ఎప్పటికప్పుడు బ్రేక్ ప్లూయిడ్ ఛేంజ్ చేస్తూ ఉండాలి. బ్రేక్లు నీటిని పీల్చుకుంటాయి కాబట్టి.. లోపల తేమ కారణంగా తుప్పు ఏర్పడటానికి ఛాన్స్ ఉంది. దీనివల్ల మెల్లగా బ్రేకుల సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి.. ఎప్పటికప్పుడు బ్రేక్ ఫ్లూయిడ్ ఛేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే.. బ్రేక్స్ చక్కగా పనిచేస్తాయి. అంతేకాదు.. వాటి లైఫ్ టైమ్ కూడా పెరుగుతుంది. డ్రైవింగ్ చేసేవాళ్లు ఈ విషయం తప్పక గుర్తుంచుకోవాలి.
మీ కారుపై గీతలు పడ్డాయా - ఇలా ఈజీగా తొలగించండి!
రైట్ లెగ్తోనే బ్రేక్..