How To Improve Credit Score Without Credit Card : నేటి కాలంలో క్రెడిట్ స్కోరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. లోన్ మంజూరు కావాలన్నా, కొత్త క్రెడిట్ కార్డు పొందాలన్నా ఈ క్రెడిట్ స్కోరే కీలకం. ఈ స్కోరు బాగుంటేనే రుణాలు త్వరగా మంజూరవుతాయి. మంచి క్రెడిట్ స్కోరు మెయింటెన్ చేయాలంటే సకాలంలో రీపేమెంట్స్ చేయడం ముఖ్యం. క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాల్లో క్రెడిట్ కార్డ్ వినియోగం కూడా ఒకటి. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు ఉంటేనే క్రెడిట్ లేదా సిబిల్ స్కోరు పెంచుకోవచ్చని అనుకుంటారు. కానీ క్రెడిట్ కార్డు లేకున్నా ఈ కింద తెలిపిన 5 పద్ధతులు ఉపయోగించి మంచి క్రెడిట్ స్కోరు సాధించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
5 Ways To Build Credit Score Without Credit Card :
1. రుణం తీసుకోవడం :
ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మీరు బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) నుంచి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇలా తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడం అనేది చాలా ముఖ్యం. దీని ద్వారానే మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా పెరుగుతుంది. ఇదే కాకుండా.. ఇప్పటికే ఈఎంఐ చెల్లింపులుంటే వాటిని కూడా సకాలంలో చెల్లించాలి. లేకపోతే మీ క్రెడిట్ స్కోరుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది.
2. సకాలంలో బిల్లుల చెల్లింపు :
దైనందిన అవసరాలు, అద్దె చెల్లింపులు, ఈఎంఐలకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించాలి. ఇలా సకాలంలో బిల్లులు చెల్లించినప్పుడే మీ క్రెడిట్ స్కోర్ మంచిగా పెరుగుతుంది. అలాకాకుండా బిల్లుల చెల్లింపులో ఏ మాత్రం తేడా వచ్చినా.. మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే బిల్లులను, ఈఎంఐలను నిర్ణీత గడువులోపు చెల్లించాలి. ఆన్-టైమ్ బిల్లు చెల్లింపుల రికార్డును మెయింటెన్ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు.