How To Get SBI ATM Franchise : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ.. ఏటీఎం ఫ్రాంచైజీ ద్వారా ఒక ప్రత్యేకమైన వ్యాపార అవకాశాన్ని కల్పిస్తోంది. దీని ద్వారా మీరు ఇంట్లోనే ఉంటూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు.
ఏటీఎంలను బ్యాంకులు ఏర్పాటు చేయవు!
నిజానికి దేశంలోని బ్యాంకులన్నీ ఏటీఎంలను ఇన్స్టాల్ చేయవు. చేసేవి కూడా తమంత తాము స్వయంగా ఏటీఎంలను ఏర్పాటు చేయవు. ఎందుకంటే, కొన్ని కంపెనీలు.. ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాయి. కనుక ఆ కంపెనీలే ఆయా బ్యాంకుల ఏటీఎంలను వివిధ ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేస్తుంటాయి.
ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటుకు కావాల్సినవి ఇవే!
SBI ATM Franchise Requirements :
- ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటు చేయాలంటే.. కనీసం 50 నుంచి 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
- కనీసం 100 మీటర్ల దూరంలో మరో ఇతర ఏటీఎంలు ఉండకూడదు.
- ప్రజలు అందరికీ కనిపించే విధంగా, గ్రౌండ్ ఫ్లోర్లో సదరు బిల్డింగ్ లేదా గది ఉండాలి.
- సదరు బిల్డింగ్ లేదా గదికి 1KW ఎలక్ట్రిసిటీ కనెక్షన్, 24 గంటలపాటు నిరంతరాయంగా పవర్ సప్లై ఉండాలి.
- ప్రతి రోజు కనీసం 300 ట్రాన్సాక్షన్స్ అయినా ప్రాసెస్ చేయగలగాలి.
- ఏటీఎం ఏర్పాటు చేసే బిల్డింగ్కు కచ్చితంగా కాంక్రీట్ రూఫ్ ఉండాలి.
- V-SAT కూడా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
నోట్ : ఈ V-SAT ఇన్స్టాలేషన్కు ప్రభుత్వం నుంచి గానీ, సొసైటీ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
కావాల్సిన డాక్యుమెంట్స్
SBI ATM Franchise Required Documents :
- ఐడీ ప్రూఫ్ : ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ
- అడ్రస్ ప్రూఫ్ : రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్
- బ్యాంక్ అకౌంట్, పాస్బుక్
- ఫొటోగ్రాఫ్
- ఫోన్ నంబర్, ఈ-మెయిల్
- జీఎస్టీ నంబర్
- ఫైనాన్సియల్ డాక్యుమెంట్స్
- బ్యాంక్ అడిగే ఇతర పత్రాలు