How to get Refund for Wrong UPI Transaction : ప్రస్తుతం భారత్ డిజిటల్ బాటలో వేగంగా అడుగులు వేస్తోంది. రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండడంతో బ్యాంకింగ్ రంగం శరవేగంగా దూసుకెళ్తోంది. అలాగే కొవిడ్ పుణ్యమా అని.. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్,యూపీఐ పేమెంట్స్(UPI Payments)ఎక్కువైపోయాయి. దాంతో జనాలు చాలా వరకు బ్యాంకుకు వెళ్లకుండానే ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకుంటున్నారు.
Best Ways for Get Wrong UPI Transaction Refund : ఇక UPI యాప్స్ విషయానికొస్తే.. కేవలం చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఉన్నచోట క్షణాల్లో చెల్లింపులు చేసేస్తున్నాం. అవతలి వ్యక్తి యూపీఐ ఐడీ, ఫోన్ నంబర్, క్యూర్ కోడ్ స్కాన్.. ఇలా ఏది ఉన్నా సులభంగా డబ్బు పంపించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కానీ, కొన్నిసార్లు మనం యూపీఐ ఐడీ/ఫోన్ నంబరు వంటివి ఎంటర్ చేసే క్రమంలో పారపాట్లు జరిగి మనం పంపే డబ్బు వేరే యూపీఐ అకౌంట్‌కి(Wrong UPI Transactions) వెళుతుంది. ఇకపై అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా మనం పంపిన డబ్బును రిఫండ్ రూపంలో పొందవచ్చు. మరి, అది ఎలాగో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
How to Retrieve Wrong UPI Transaction Money :మీరు తప్పు ఖాతాకు UPI చెల్లింపు చేసి ఉంటే వెంటనే మీ ఫోన్‌లోని తక్షణ హెచ్చరిక నుంచి టెక్స్ట్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు టెక్స్ట్‌ని అందుకోనట్లయితే మీరు ఆ UPI యాప్ ద్వారా లావాదేవీలు జరిపారో దాని ద్వారా కూడా లావాదేవీని నివేదించవచ్చు. అయితే Paytm, BHIM, Google Pay, PhonePe వంటి UPI యాప్‌లలో ఏ విధంగా రిపోర్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Paytm UPI ద్వారా రిపోర్ట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
How to Report for Wrong UPI Transaction on Paytm :మీరు Paytm ద్వారా తప్పు వ్యక్తికి డబ్బులు పంపినట్లయితే.. మీరు నేరుగా ఆ వ్యక్తిని సంప్రదించి మీ మనీ తిరిగి ఇవ్వమని అడగాలి. ఒకవేళ మీరు ఆయనను చేరుకోలేకపోతే నేరుగా సమన్వయం కోసం అతని వివరాలను పొందడానికి మీరు రిసీవర్ బ్యాంక్‌ని సంప్రదించవచ్చు. అలాగే మీరు రిసీవర్‌తో మాట్లాడలేకపోతే క్రింద పేర్కొన విధంగా 24×7 సహాయ విభాగం ద్వారా Paytmని సంప్రదించండి.
- మొదట మీ ఫోన్‌లో పేటీఎం ఓపెన్ చేసి.. ఎగువ ఎడమవైపున ఉన్న ప్రొఫైల్ పిక్చర్ మెనుపై నొక్కాలి.
- ఆ తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి.. 24×7 Help and Support అనే ఆప్షన్‌పై నొక్కాలి.
- అనంతరం మళ్లీ స్క్రోల్ డౌన్ చేసి View All Servicesపై క్లిక్ చేయాలి. UPI Payment & Money Transfer అనే విభాగానికి వెళ్లాలి.
- అక్కడ మీరు ఫిర్యాదును నివేదించాలనుకుంటున్న wrong transactionను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీరు ఫిర్యాదు చేయడానికి, రిఫండ్ ప్రక్రియను ప్రారంభించడానికి Paytm అసిస్టెంట్‌తో చాట్‌ని ప్రారంభించాలి. జరిగిన విషయం చెప్పాలి.
- అప్పుడు Paytm బృందం రిసీవర్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది. సమ్మతి పొందిన తర్వాత మీరు తప్పుడు యూపీఐ ద్వారా పంపిన మొత్తాన్ని రిఫండ్ చేస్తుంది.
How to Use UPI Lite : మీరు 'యూపీఐ పిన్' ఎంటర్ చేయకుండానే.. డబ్బులు చెల్లించవచ్చు.!
How to Report for Refund Wrong UPI Transaction on BHIM UPI :
BHIM UPI ద్వారా తప్పుడు ట్రాన్సక్షన్కి ఎలా రిఫండ్ పొందాలో చూద్దాం..
- మొదట మీరు BHIM యాప్ ఓపెన్ చేసి.. ఎగువ కుడివైపు ఉన్న Hamburger Menu (మూడు లైన్లు)పై నొక్కాలి.
- ఆ తర్వాత Raise Complaint అనే ఆప్షన్‌కి వెళ్లాలి.
- అప్పుడు మీరు ఫిర్యాదును చేయాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వివరాలను పూరించడానికి Raise a Concernపై నొక్కాలి లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయడానికి మీరు కాల్ బ్యాంక్‌పై నొక్కాలి.