తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Get PPO Number in Online : ప్రైవేట్ ఉద్యోగులారా.. పీపీఓ నంబర్ తెలుసుకున్నారా..? - ETV Bharat

How to Find PPO Number Online : ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) ద్వారా పెన్షన్ పొందడం మనందరికి తెలిసిన విషయమే. ఆ పెన్ష‌న్ పొందాలంటే వారు కచ్చితంగా పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్(పీపీఓ) నంబర్ కలిగి ఉండాలి. కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకు ఖాతా నంబర్ లేదా పీఎఫ్ నంబర్ ద్వారా ఆన్​లైన్​లో సులభంగా పీపీఓ నంబర్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

PPO Number
How to find PPO Number Online

By

Published : Aug 17, 2023, 2:04 PM IST

How to Find PPO Number in Online :సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం వివిధ స్కీమ్​ల ద్వారా లబ్ది పొందడం మనం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా పదవీ విరమణ అనంతరం అలాంటి బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్​ఓ).. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్)అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు ఈపీఎస్ ఓ ప్రత్యేకమైన పెన్షన్ పేమెంట్ ఆర్డర్(పీపీఓ)అనే నంబర్​ను కేటాయిస్తుంది.

How to Check PPO Number Status : పదవీ విరమిణ అనంతరం ఉద్యోగి పెన్షన్ పొందాలంటే కచ్చితంగా ఈ నంబర్​ను కలిగి ఉండాలి. అదేవిధంగా కేంద్ర ఫైనాన్స్ అకౌంటింగ్(సీపీఏఓ)తో ఏదైనా సంప్రదించాలనుకుంటే మొదటగా కావాల్సిన రిఫరెన్సు నంబర్ కూడా ఇదే. అలాగే ఏదైనా కారణం చేత ఈ నంబర్​ను మర్చిపోతే ఎలా తెలుసుకోవాలి, కొత్తవారు ఈ పీపీఓ నంబర్​ను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆన్​లైన్​లో పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ నంబర్‌ పొందడం ఎలా..

పెన్షన్‌ పేమెంట్ ఆర్డర్‌ నంబర్‌(పీపీఓ)12 అంకెలను కలిగి ఉంటుంది. ఈ అంకెలలో మొద‌టి ఐదు అంకెలు పీపీఓ జారీ చేసే అథారిటీ కోడ్‌ను, త‌ర్వాత వచ్చే రెండు అంకెలు.. నంబ‌ర్‌ ఇచ్చిన సంవ‌త్సరాన్ని, వీటి తర్వాత వచ్చె నాలుగు అంకెలు పెన్షన్‌ పేమెంట్ ఆర్డర్‌ సీక్వెన్షియ‌ల్ నంబ‌ర్‌ను, చివ‌రి అంకె నంబర్ కంప్యూట‌ర్ చెక్ కోడ్‌ను సూచిస్తాయి. పెన్షన్​దారులు ఈ పీపీఓ నంబర్ పొందేందుకు(How to Apply Pension Payment Order Number) కింది దశలను పాటించాల్సి ఉంటుంది.

1. మొదటగా చందాదారులు www.epfindia.gov.inఅనే వెబ్​సైట్​లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.

2. ఆ తర్వాత ఆన్​లైన్ సర్వీస్ కింద ఉన్న పెన్షన్​ పోర్టల్​పై క్లిక్ చేయాలి.

3. అప్పుడు వెల్​కమ్​ టు పెన్షనర్స్ పోర్టల్ అనే మెసేజ్ కనిపిస్తుంది.

4. ఆ తర్వాత పేజీకి కుడివైపున ఉన్న పేర్కొన్న Know Your PPO Numberపై క్లిక్ చేయాలి.

5. ఇప్పుడు ఎవరైతే పీపీఓ నంబర్ పొందాలనుకుంటున్నారో వారి బ్యాంక్ ఖాతా నంబర్(How to get PPO Number Using Bank Account) లేదా మెంబర్ ఐడీ అక్కడ ఎంటర్ చేయాలి.

6. సంబంధిత సమాచారాన్ని అక్కడ నమోదు చేసిన తర్వాత మీరు మీ పీపీఓ నంబర్, అదేవిధంగా మీ మెంబర్ ఐడీ, పెన్షన్​ రకాన్ని తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ పెన్షన్ స్టేటస్​ను కూడా తెలుసుకోవచ్చు.

Multiple EPF Accounts Merge : వేర్వేరు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయా?.. వెంటనే వాటిని మెర్జ్​ చేసుకోండి!

పీపీవో నెంబర్ ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీస్(సీపీఏవో)తో ఏదైనా సంప్రదించాలనుకుంటే మొదటగా కావాల్సిన రిఫరెన్సు నంబర్ పీపీఓ నంబర్. ప్రతి ప్రైవేట్ రంగంలో పనిచేసే పదవీ విరమణ ఉద్యోగి పెన్షన్ పొందడానికి ఈ నంబర్ సహకరిస్తుంది. అదేవిధంగా ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేటప్పుడు ఈ నెంబర్‌ను ముఖ్యంగా పేర్కొనాలి. కాబట్టి పదవీ విరమణ అనంతరం ప్రతి ఉద్యోగి పీపీఓ నంబర్ పొందడం చాలా అవసరం. సదరు పెన్షన్​దారుడు తన పీఎఫ్ ఖాతా(PF Account)ను ఒక బ్యాంకు శాఖ నుంచి మరో బ్యాంకుకు మార్చుకోవాలంటే ఈ నంబర్ కచ్చితంగా తెలియాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(ఈపీఎస్)వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అందించే పథకాలలోఉద్యోగుల పెన్షన్ స్కీమ్(Employees Pension Scheme)కూడా ఒకటి. ఈ పథకాన్ని 1995లో తీసుకొచ్చారు. ఈపీఎఫ్ఓలో సభ్యులైన ఉద్యోగులకు ఈ స్కీమ్​ వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల వలే ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈ పథకం ద్వారా పదవీ విరమణ అనంతరం నెలవారి పెన్షన్ పొందవచ్చు.

ఒకవేళ ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే ఆ తదుపరి ఈ పెన్షన్​ను నామినీ పొందవచ్చు. సంస్థ, ఉద్యోగి 12 శాతం చొప్పున ఆయన వేతనానికి సమానమైన మొత్తాన్ని ప్రతి నెల ఈ స్కీమ్​లో జమ చేస్తారు. ఉద్యోగి పనిచేసే సంస్థ వాటా 12 శాతంలో 8.33 శాతం ఈ స్కీమ్​కు వెళ్తే.. మిగతా 3.67 శాతం ఈపీఎఫ్​కు వెళ్తుంది. పదవీ విరమణ లేదా సూప‌ర్ యాన్యుయేష‌న్, ప్రాణాలతో బయటపడినవారు, వైకల్యం పొందిన‌వారు, వితంతువులు, పిల్లలు మొద‌లైన వారికి నెలవారీ ప్రయోజనాన్ని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) అందిస్తుంది.

PPF Vs EPF Vs VPF : పీపీఎఫ్​ Vs ఈపీఎఫ్​ Vs వీపీఎఫ్​.. వీటి పన్నుల భారం ఎంత?

EPFO Interest Rate : ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఈపీఎఫ్​ఓ వడ్డీ రేటు 8.15 శాతానికి కేంద్రం ఓకే!

ABOUT THE AUTHOR

...view details