How to Get Personal Loan with Pan Card Details in Telugu:తక్షణ ఆర్థిక అవసరాలు.. అనుకోకుండా వచ్చిపడే ఖర్చులను ఎదుర్కోవడానికి ఉన్న అతికొద్ది మార్గాల్లో పర్సనల్ లోన్ ఒకటి. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వ్యక్తిగత రుణాలు మన బెస్ట్ ఫ్రెండ్ లాగా పని చేస్తాయి. మీ వద్ద గ్యారెంటీగా తాకట్టు పెట్టడానికి ఏమీ లేకపోయినా, మీరు సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. కానీ.. కొన్నిసార్లు పర్సనల్ లోన్ పొందడానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది. అయితే మీకు పాన్‌కార్డ్‌తో లోన్ పొందవచ్చు అనే విషయం తెలుసా..?
Personal Loan Tips: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలియకపోతే అంతే!
పాన్‌కార్డ్: ఆర్థిక లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు అవసరం ఉంటుంది. పదంకెల పర్మినెంట్ అకౌంట్ నంబర్.. (PAN) కొన్ని లావాదేవీలకు తప్పనిసరి. ఇంకా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు, డీమ్యాట్ ఖాతా కోసమైనా పాన్ కార్డ్ అవసరం. ఆర్థిక లావాదేవీల్ని ట్రాక్ చేయడం.. పన్నులకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు గుర్తించడం.. ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలాన్నా, జీతం పొందాలన్నా,.. ఇలా ఎన్నో ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు అనేది తప్పనిసరి. అయితే పాన్ కార్డ్ సహాయంతో రూ.50,000 వరకు లోన్ పొందవచ్చు. ప్రస్తుతం చాలా బ్యాంకులు పాన్ కార్డు ద్వారా రుణాలు ఇస్తున్నాయి.
లోన్ పొందటానికి అర్హత..:పాన్ కార్డ్ సహాయంతో రుణం పొందడానికి, మీరు కొన్ని పత్రాలను సమర్పించాలి.
- లోన్ పొందడానికి మీకు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
- మీరు కంపెనీలో పని చేసినా లేదా మీ సొంత వ్యాపారం కలిగినా, మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండాలి.
- మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే మీరు లోన్ పొందడానికి అర్హులవుతారు.
Personal Loan Problems: పర్సనల్ లోన్ తీసుకోవటం మంచిదేనా..? సమస్యలేంటి..?